టాలీవుడ్

సత్య ట్రైలర్ లాంచ్ ఈవెంట్ . మే 10న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్

శివమ్ మీడియా నిర్మాణ సంస్థ నుండి తొలి సినిమా సత్య ట్రెయిలర్ ఈరోజు 8 మంది దర్శకుల చేతుల మీదగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.

డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ : హమరేష్ చూడడానికి జి.వి. ప్రకాష్ లాంచ్ అయినప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు, నా మొహమాటాన్ని కూడా దాటి శివ కోసం ఫొటోస్ దిగేవాడిని. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నాను ‘సినిమాలో సరస్వతి ఉన్నారు కాబట్టి, ఈ సినిమాతో మా శివ మల్లాల కి లక్ష్మి కూడా రావాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ : సత్య ట్రైలర్ చాల బాగుంది, టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి అలానే మంచి సక్సెస్ లు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

రైటర్, డైరెక్టర్ సతీష్ వేగేశ్న మాట్లాడుతూ: ఇండస్ట్రీలో మనం ఎవరితో అయినా ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు మొదట్లో ఒకలా ఉన్నా, పోను పోను వారి ప్రవర్తన మారిపోతు ఉంటుంది. కాని శివ మల్లాల మాత్రం డే వన్ నుండి ఈరోజు వరుకు అదే ప్రవర్తన, అదే మంచి తనంతో ఉన్నారు. ఇప్పుడు నిర్మాతగా చేస్తున్నాడు, ప్రతి సినిమాకి ఫ్రైడే రోజు రివ్యూ చెప్తూ ఉంటాడు, అలా తియ్యొచ్చు ఇలా తియ్యొచ్చు అని, ఇప్పుడు శివ నే సినిమా నిర్మాణం చేస్తున్నప్పుడు కచ్చితంగా అలాంటి లోపాలు ఏమి లేకుండానే చేస్తాడు అనుకుంటున్నాను. కచ్చితంగా శివకి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ : సత్య ట్రైలర్ చాలా బాగా నచ్చింది, ఆర్టిస్టులు చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశారు. మీడియా, జర్నలిజం గత 25 ఏళ్ళలో ఎంతో రూపాంతరం చెందింది, ఆ రుపంతరానికే నిలువెత్తు నిదర్శనం శివ. అప్పటి జర్నలిజం నుంచి ఇప్పటి జర్నలిజం వరకు ప్రతి స్టేజిలో శివ ని చూడొచ్చు. నేను సాఫ్ట్వేర్ జాబు మానేసి స్నేహ గీతం సినిమా తీసినప్పుడు ధియేటర్ లో జనాలు లేరు, చాలా హర్ట్ అయ్యాను, అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, శివ మల్లాల నుండి, మీరు ఇండస్ట్రీలో మంచిగా సక్సెస్ అవుతారు అని. సినిమా బాగుంది అని అప్రిసియేషన్ ఇచ్చాడు అది నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండడానికి శివ కూడా ఒక కారణం. అల్ ది బెస్ట్ శివ ఈ సినిమా నీకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

డైరక్టర్ పవన్ సాదినేని మాట్లాడుతూ : ట్రైలర్ చూస్తే యాక్టర్స్ అందరూ దాదాపు కొత్త వారే కానీ చాలా బాగా చేసారు. ఈరోజు నేను ఇక్కడకి రావడానికి కారణం శివ గారు. నేను సినిమాలు తీసినప్పుడు శివ గారి నుంచి కాల్ వస్తే మాత్రం, హమ్మయ్య మంచి సినిమానే తీశాను అని అనుకుంటాను. ఆయన ఈరోజు సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆయనకు మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ : ఈ సత్య కచ్చితంగా హిట్టు అవుతుంది. ఎందుకంటె శివ గారు భాషతో సంబంధం లేకుండా టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు నాకు వాటి ఎనాలిసిస్ చెప్పే వారు. అది ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది అని, ఆయన ఒక 100 సినిమాలకి అల చెప్పి ఉంటే 90 శాతం అయన చెప్పినట్టే జరిగేది అంత జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ : శివ మల్లాల ఒక చిన్న ఫోటోగ్రాఫర్ గా వచ్చి ఈరోజు ఒక నిర్మాతగా ఎదిగాడు, చాలా మంచి వ్యక్తి అన్ని జనరేషన్స్ వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తాడు, చాలా తక్కువ డబ్బింగ్ సినేమాలు మాత్రమే విజయాన్ని అందుకుంటాయి, ఈ సత్య సినిమా విజువల్స్ చూస్తుంటే కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని అన్నారు.

దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ : తమిళ్ లో ఈ సినిమాని నేను రంగోలి గా తీసాను, ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల గారి ద్వార వస్తుంది, అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ : ఈరోజు నేను సినిమా చేస్తున్నప్పుడు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నాను, కానీ సినీమా చూడగానే నాకు బాగా నచ్చింది వెంటనే వాలి మోహన్ దాస్ కి కాల్ చేసి అప్రిషియేట్ చేశాను, తెల్లవారుజామున 4 గంటలకి వాలికి నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంచ్ అనే మాట చెప్పడం కోసం ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్ గా స్టార్ట్ అయ్యి ప్రొడ్యూసర్ వరుకు వచ్చాను అంటే అది కేవలం నాకు నా కెరీర్ ముందు నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. 10 న సత్య సినీమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి అని అన్నారు.

హీరోయిన్ ప్రార్థన సందీప్ మాట్లాడుతూ : తమిళ్ లో సినిమా మంచి హిట్ అయ్యింది, ఈరోజు తెలుగులో మాకు శివ మల్లాల గారు మంచి స్టేజ్ ఇచ్చారు. తెలుగులో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరో హమరేష్ మాట్లాడుతూ : నా ఫ్యామిలీ మరియు నా వెల్ విషర్స్ నన్ను ఇక్కడి వరుకు తీసుకొని వచ్చారు. శివ మల్లాల గారి ఇన్స్పిరేషన్ స్టోరీ వింటున్నప్పుడు నాకు గూస్ బంబ్స్ వచ్చాయి. ఇలాంటి వ్యక్తి చేతుల మీదగా తెలుగులో లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

ట్రెయిలర్ కి కూడా ప్రక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మే 10న థియేటర్లో అందరూ చూడాలని టీమ్ మీడియాతో చెప్పారు.

నటీ నటులు
హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ

టెక్నీషియన్స్
మ్యూజిక్ – సుందరమూర్తి కె.యస్, ఎడిటింగ్‌ – ఆర్‌.సత్యనారాయణ, కెమెరా – ఐ. మరుదనాయగం,
మాటలు – విజయ్‌కుమార్‌ పాటలు – రాంబాబు గోసాల,
పిఆర్ఓ – వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల,
లైన్‌ ప్రొడ్యూసర్‌ – పవన్‌ తాత,
నిర్మాత – శివమల్లాల,
రచన –దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్

Tfja Team

Recent Posts

Rahasyam Idam Jagat A Unique Story Komal R Bharadwaj

Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…

10 mins ago

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయిని కథ రహస్య ఇదం జగత్‌ దర్శకుడు కోమల్‌

మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్‌. అమ్మ…

11 mins ago

Erra Cheera Movie Glimpse Release Event Movie Release On Dec 20

The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…

57 mins ago

ఎర్రచీర సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్. డిసెంబర్ 20న మూవీ విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…

58 mins ago

షాపింగ్ మాల్ సినిమాకు 14 ఏళ్లు.

తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…

1 hour ago

The movie Shopping Mall has completed 14 years..

Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…

1 hour ago