హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా
అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – నా స్నేహితుడు ప్రొడ్యూసర్ నరేంద్ర మరో మంచి చిత్రాన్ని చేస్తున్నారు. హీరో సత్యదేవ్ గారు ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా సాధించబోయే విజయం గురించి తర్వాత మళ్లీ మాట్లాడుతాను. డైరెక్టర్ లక్ష్మినారాయణకు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా, అన్నారు.
డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ – మా సినిమా జానర్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. రామ్ మిరియాల అన్న మా సినిమాకు మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ గారి కెరీర్ లో ఇదొక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన అతిథులకు, మీడియా మిత్రులకు థ్యాంక్స్. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల మాట్లాడుతూ – మా అందరికీ ఇదొక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సత్య అన్నతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. రెండు పాటలు ఇప్పటికే కంప్లీట్ చేశాం. పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రంలో మ్యూజిక్ ను మాతో పాటు మీరంతా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నటీనటులు – సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఎస్ఎస్ కాంచి, సురేష్ గురు, తదితరులు
ఆర్ట్ డైరెక్టర్ – అరవింద్ ములె
ఎడిటర్ – నరేష్ అడుప
డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – రామ్ మిరియాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నవీన్ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
ప్రొడ్యూసర్ – బి.నరేంద్ర రెడ్డి
డైరెక్టర్ – లక్ష్మినారాయణ పుట్టంచెట్టి
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం…
అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ‘రాకాసా’ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను…