రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సారంగదరియా’ గ్రాండ్ రిలీజ్‌

Must Read

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తోపాటు, లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా…’ అనే ఇన్‌స్పిరేషనల్ సాంగ్ తో పాటు ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే ఎమోష‌న‌ల్ లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ‘‘మా ‘సారంగదరియా’ చిత్రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన టీజర్‌, పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. రాజా ర‌వీంద్ర‌గారిని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌న‌టువంటి స‌రికొత్త పాత్ర‌లో చూడ‌బోతున్నారు. జూలై 12న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ ‘‘‘సారంగదరియా’ మూవీ ట్రైలర్ త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాం. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాను జూలై 12న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి (పండు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అరుణాచల మహేష్, మాటలు – వినయ్ కొట్టి, ఎడిటర్ – రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ – ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు, పాటలు – రాంబాబు గోశాల, కడలి స‌త్య‌నారాయ‌ణ‌ , అడిషనల్ రైటర్ – రఘు రామ్ తేజ్.కె, పి.ఆర్.ఒ – కడలి రాంబాబు, తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News