రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. హీరో నిఖిల్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. ఈ ఈవెంట్‌లో….
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘సారంగదరియా జూలై 12న రాబోతోంది. మంచి థియేటర్లు దొరికాయని చెబుతున్నారు. అందరూ థియేటర్‌కు వెళ్ళి సినిమాను చూడండి. రాజా రవీంద్ర గారు నాకు ఫ్యామిలీ వంటి వారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. మాలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశారని అర్థం అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎబినైజర్ పాల్ సంగీతం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడండి. ఇలాంటి చిత్రానికి మీడియా సపోర్ట్ ఉండాలి’ అని అన్నారు.
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు అడగ్గానే వచ్చిన నవీన్ చంద్ర గారెకి థాంక్స్. తగ్గేదేలే సినిమాకు నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేశాను. ఆ చిత్రానికి పండు డైరెక్షన్‌లో పని చేశాడు. మహేష ఈ చిత్రానికి మేనేజర్‌గా పని చేశాడు. మా డైరెక్టర్ సినిమా గురించి ట్రైలర్‌లోనే మొత్తం చెప్పేశాడు. ఫెయిల్యూర్ అనేది చాలా డేంజర్ అని చూపించాడు. ఈ చిత్రంలో నాకు ముగ్గురు కొడుకులుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్యలుంటాయి. కాలేజ్ లెక్చరర్‌గా పని చేసి అందరికీ నీతులు చెబుతాను. కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతాను. సోషల్ మీడియా, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదు. కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి టైంలో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. కంటెంట్ బాగుండటంతో బలగం ఆడింది. మన సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాత చెబుతుంటూ ఉంటారు. పండు టీం అందరితో చక్కగా పని చేయించుకున్నాడు. మా నిర్మాత సైతం దర్శకుడు పండుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోంది. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడకండి.. ట్రోలింగ్ చేయకండి’ అని అన్నారు.
నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ పండు వచ్చాకే ఈ సినిమా టీం ఫాం అయింది. ఈ చిత్రానికి మహేష్ చాలా కష్టపడ్డాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ ఎపి చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఎక్కడా కూడా చిన్న చిత్రంగా భావించలేదు. మంచి ఆర్ఆర్ ఇచ్చారు. డీఓపీ సిద్దు గారు పీసీ శ్రీరామ్ వద్ద పని చేశారు. రాంబాబు, కడలి మంచి లిరిక్స్ ఇచ్చారు. యశస్విని, మోయిన్, మోహిత్ అందరూ బాగా నటించారు. ఎక్కడా కొత్త వాళ్లు నటించినట్టుగా అనిపించదు. ముహూర్తపు షాట్ రోజు స్వయంగా రాజా రవీంద్ర వెళ్లి వివి వినాయక్‌ను తీసుకొచ్చారు. రాజా రవీంద్ర చాలా మంచి వ్యక్తి. నవీన్ చంద్ర, రాజ్ తరుణ్, నిఖిల్ ఇలా అందరూ మా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీనంతటకి కారణం రాజా రవీంద్ర గారు. నిర్మాతలకు ఆయన చాలా సపోర్ట్ ఇస్తుంటారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
దర్శకుడు పండు మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన నవీన్ చంద్ర గారికి థాంక్స్. ఈ కథను చెప్పినప్పుడు సహజంగా ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ మా సాయిజా ప్రొడక్షన్స్ అధినేత శరత్ గారు వెంటనే ఒప్పుకున్నారు. సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. నన్ను నమ్మి చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన నిర్మాత శరత్ గారికి థాంక్స్. మా నిర్మాత ఉమాదేవీ గారికి థాంక్స్. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర గారు ఫాదర్ రోల్‌ను ఎంత బాగా పోషించారో.. నా రియల్ లైఫ్‌లో గాడ్ ఫాదర్ రోల్‌ను అంత బాగా పోషించారు. ఆయన వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను.ట్రాన్స్ ఉమెన్‌గా యశస్విని గారు అద్భుతంగా నటించారు. మోయిన్, మోహిత్‌లు చక్కగా నటించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ అన్న ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. డీఓపీ సిద్దు, ఎడిటర్ రాకేష్ గారికి థాంక్స్. ఎపి గారు మంచి పాటలు ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాను. వందకు పైగా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాను. ఈ చిత్రం బాగా ఆడుతుందని, లాభాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనెజర్ పాల్ మాట్లాడుతూ.. ‘మా దర్శకుడు పండు చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. ప్రతీ ట్యూన్ ఎంతో చర్చించి ఫైనల్ చేసే వాళ్లం. చిత్ర గారు తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు మోయిన్ మాట్లాడుతూ.. ‘మాలాంటి కొత్త వారిని నమ్మి ఇంత బాగా నిర్మించిన నిర్మాత శరత్ గారికి థాంక్స్. ఇలాంటి నిర్మాతలు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లు ఇంకా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. మా దర్శకుడు పండు కార్య సాధకులు. వాళ్లకి కావాల్సింది ఎంత కష్టమైనా సాధిస్తుంటారు. రాజా సర్ పెద్ద పెద్ద స్టార్‌లందరితోనూ నటించారు. మా అందరితోనూ ఎంతో సరదాగా ఉండేవారు. ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిటల్ సీన్‌లో రాజా రవీంద్ర గారు ఏడిపించేస్తారు. మా సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
నటుడు మోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను సాయి అనే పాత్రను పోషించాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా నా కారెక్టర్‌ను మా దర్శకుడు బాగా డిజైన్ చేశారు. మమ్మల్ని ఎంతో నమ్మి మా నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించారు. మా డీఓపీ మంచి విజువల్స్ ఇచ్చారు. రాజా రవీంద్ర గారితో నటించడం ఆనందంగా ఉంది. టీంకు పని చేసిన వారందరికీ థాంక్స్. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత మహేష్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రంలో పండు మంచి పాత్రను ఇచ్చారు. మేనేజర్ అయిన నన్ను ఈ చిత్రానికి మా నిర్మాత ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా మార్చారు. రాజా రవీంద్ర గారు మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ మా సినిమాను ఆదరించండి’ అని అన్నారు.
నటి యశస్విని మాట్లాడుతూ.. ‘మాలాంటి చిన్న చిత్రాలను సపోర్ట్ చేసేందుకు వచ్చిన నవీన్ చంద్ర గారెకి థాంక్స్. సినిమాలో మా కుటుంబానికి మెయిన్ పిల్లర్‌గా రాజా రవీంద్ర గారు ఎలా నిలిచారో.. బయట ఈ చిత్రానికి కూడా ఆయన మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. నన్ను నమ్మి ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన దర్శకుడు పండు గారికి థాంక్స్. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించేందుకు నిర్మాతలకి గట్స్ ఉండాలి. మిమ్మల్ని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారెకి థాంక్స్. జూలై 12న మా చిత్రాన్ని అందరూ థియేటర్లో వీక్షించండి’ అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్స్ కడలి, గోశాల రాంబాబు, ఆదిత్య నిరంజన్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…