‘సారంగదరియా’.. ప్రతీ ఇంట్లో జరిగే కథ.. హీరో నవీన్ చంద్ర

Must Read

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. హీరో నిఖిల్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. ఈ ఈవెంట్‌లో….

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘సారంగదరియా జూలై 12న రాబోతోంది. మంచి థియేటర్లు దొరికాయని చెబుతున్నారు. అందరూ థియేటర్‌కు వెళ్ళి సినిమాను చూడండి. రాజా రవీంద్ర గారు నాకు ఫ్యామిలీ వంటి వారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. మాలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశారని అర్థం అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎబినైజర్ పాల్ సంగీతం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడండి. ఇలాంటి చిత్రానికి మీడియా సపోర్ట్ ఉండాలి’ అని అన్నారు.

న‌టుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు అడగ్గానే వచ్చిన నవీన్ చంద్ర గారెకి థాంక్స్. తగ్గేదేలే సినిమాకు నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేశాను. ఆ చిత్రానికి పండు డైరెక్షన్‌‌లో పని చేశాడు. మహేష ఈ చిత్రానికి మేనేజర్‌గా పని చేశాడు. మా డైరెక్టర్ సినిమా గురించి ట్రైలర్‌లోనే మొత్తం చెప్పేశాడు. ఫెయిల్యూర్ అనేది చాలా డేంజర్ అని చూపించాడు. ఈ చిత్రంలో నాకు ముగ్గురు కొడుకులుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్యలుంటాయి. కాలేజ్ లెక్చరర్‌గా పని చేసి అందరికీ నీతులు చెబుతాను. కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతాను. సోషల్ మీడియా, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదు. కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి టైంలో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. కంటెంట్ బాగుండటంతో బలగం ఆడింది. మన సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాత చెబుతుంటూ ఉంటారు. పండు టీం అందరితో చక్కగా పని చేయించుకున్నాడు. మా నిర్మాత సైతం దర్శకుడు పండుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోంది. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడకండి.. ట్రోలింగ్ చేయకండి’ అని అన్నారు.

నిర్మాత శరత్ చంద్ర చ‌ల్ల‌ప‌ల్లి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ పండు వచ్చాకే ఈ సినిమా టీం ఫాం అయింది. ఈ చిత్రానికి మహేష్ చాలా కష్టపడ్డాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ ఎపి చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఎక్కడా కూడా చిన్న చిత్రంగా భావించలేదు. మంచి ఆర్ఆర్ ఇచ్చారు. డీఓపీ సిద్దు గారు పీసీ శ్రీరామ్ వద్ద పని చేశారు. రాంబాబు, కడలి మంచి లిరిక్స్ ఇచ్చారు. యశస్విని, మోయిన్, మోహిత్ అందరూ బాగా నటించారు. ఎక్కడా కొత్త వాళ్లు నటించినట్టుగా అనిపించదు. ముహూర్తపు షాట్ రోజు స్వయంగా రాజా రవీంద్ర వెళ్లి వివి వినాయక్‌ను తీసుకొచ్చారు. రాజా రవీంద్ర చాలా మంచి వ్యక్తి. నవీన్ చంద్ర, రాజ్ తరుణ్, నిఖిల్ ఇలా అందరూ మా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీనంతటకి కారణం రాజా రవీంద్ర గారు. నిర్మాతలకు ఆయన చాలా సపోర్ట్ ఇస్తుంటారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శకుడు పండు మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన నవీన్ చంద్ర గారికి థాంక్స్. ఈ కథను చెప్పినప్పుడు సహజంగా ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ మా సాయిజా ప్రొడక్షన్స్ అధినేత శరత్ గారు వెంటనే ఒప్పుకున్నారు. సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. నన్ను నమ్మి చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన నిర్మాత శరత్ గారికి థాంక్స్. మా నిర్మాత ఉమాదేవీ గారికి థాంక్స్. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర గారు ఫాదర్ రోల్‌ను ఎంత బాగా పోషించారో.. నా రియల్ లైఫ్‌లో గాడ్ ఫాదర్ రోల్‌ను అంత బాగా పోషించారు. ఆయన వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను.ట్రాన్స్ ఉమెన్‌గా యశస్విని గారు అద్భుతంగా నటించారు. మోయిన్, మోహిత్‌లు చక్కగా నటించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్ అన్న ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. డీఓపీ సిద్దు, ఎడిటర్ రాకేష్ గారికి థాంక్స్. ఎపి గారు మంచి పాటలు ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాను. వందకు పైగా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాను. ఈ చిత్రం బాగా ఆడుతుందని, లాభాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనెజర్ పాల్ మాట్లాడుతూ.. ‘మా దర్శకుడు పండు చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. ప్రతీ ట్యూన్ ఎంతో చర్చించి ఫైనల్ చేసే వాళ్లం. చిత్ర గారు తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు మోయిన్ మాట్లాడుతూ.. ‘మాలాంటి కొత్త వారిని నమ్మి ఇంత బాగా నిర్మించిన నిర్మాత శరత్ గారికి థాంక్స్. ఇలాంటి నిర్మాతలు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లు ఇంకా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. మా దర్శకుడు పండు కార్య సాధకులు. వాళ్లకి కావాల్సింది ఎంత కష్టమైనా సాధిస్తుంటారు. రాజా సర్ పెద్ద పెద్ద స్టార్‌లందరితోనూ నటించారు. మా అందరితోనూ ఎంతో సరదాగా ఉండేవారు. ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌ సీన్‌లో రాజా రవీంద్ర గారు ఏడిపించేస్తారు. మా సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

నటుడు మోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను సాయి అనే పాత్రను పోషించాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా నా కారెక్టర్‌ను మా దర్శకుడు బాగా డిజైన్ చేశారు. మమ్మల్ని ఎంతో నమ్మి మా నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించారు. మా డీఓపీ మంచి విజువల్స్ ఇచ్చారు. రాజా రవీంద్ర గారితో నటించడం ఆనందంగా ఉంది. టీంకు పని చేసిన వారందరికీ థాంక్స్. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత మహేష్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రంలో పండు మంచి పాత్రను ఇచ్చారు. మేనేజర్ అయిన నన్ను ఈ చిత్రానికి మా నిర్మాత ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా మార్చారు. రాజా రవీంద్ర గారు మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ మా సినిమాను ఆదరించండి’ అని అన్నారు.

నటి యశస్విని మాట్లాడుతూ.. ‘మాలాంటి చిన్న చిత్రాలను సపోర్ట్ చేసేందుకు వచ్చిన నవీన్ చంద్ర గారెకి థాంక్స్. సినిమాలో మా కుటుంబానికి మెయిన్ పిల్లర్‌గా రాజా రవీంద్ర గారు ఎలా నిలిచారో.. బయట ఈ చిత్రానికి కూడా ఆయన మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. నన్ను నమ్మి ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన దర్శకుడు పండు గారికి థాంక్స్. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించేందుకు నిర్మాతలకి గట్స్ ఉండాలి. మిమ్మల్ని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారెకి థాంక్స్. జూలై 12న మా చిత్రాన్ని అందరూ థియేటర్లో వీక్షించండి’ అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో లిరిక్ రైట‌ర్స్ క‌డ‌లి, గోశాల రాంబాబు, ఆదిత్య నిరంజ‌న్ త‌దిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News