సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!

Must Read

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

సప్తసాగరాలు సప్తగిరులు సినిమాను కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం.సుబ్బారెడ్డి ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా అక్టోబర్ 9న విడుదల చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది, ఇటీవల విడుదలైన మందాడి సినిమాతో సక్సెస్ సాధించిన సూరి అలాగే బెతలహెమ్ కుటుంబ యూనిట్ సినిమాతో సంచలన విజయం సాధించిన నివీన్ పులె ఈ సినిమాలో నటించడం విశేషం

రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపధ్యం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ్ లో తంగ మీన్కల్, తారమణి, పెరంబు వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.

సంచారి పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో అక్టోబర్ 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Latest News

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా...

More News