టాలీవుడ్

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాంటీ డ్రగ్స్ యాడ్ కు దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి

డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కోసం యాంటీ డ్రగ్ యాడ్ ను తయారుచేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ యాడ్ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైంది. ఈ యాడ్ ను టామాడ మీడియా ఎగ్జిక్యూట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ గురించి ట్వీట్ చేస్తూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం నుంచి ఈ యాడ్ ను తెలంగాణలోని ప్రతి థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు.

డ్రగ్స్ కు బానిస కావడం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు ఎలా పాడుచేసుకుంటున్నారో ఈ యాడ్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించారు సంజీవ్ రెడ్డి. డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిపై చర్యలు తీసుకుంటూనే డ్రగ్స్ కు బానిసైన వారికి చేయూత అందించి, వారిని మళ్లీ మంచి మార్గంలో పెట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎలాంటి సపోర్ట్ అందిస్తుందో ఈ యాడ్ లో ఎఫెక్టివ్ గా చూపించారు సంజీవ్ రెడ్డి.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి స్పందిస్తూ – ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నానో ఆ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ థియేట్రికల్ యాడ్ లో నేనూ ఒక భాగమైనందుకు, ఇక చాలు ఈ జన్మ కి అనిపిస్తుంది. కానీ, మళ్ళీ ఈ కోరికలకు అంతే ఉండదు. అని అన్నారు.

అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన సంజీవ్ రెడ్డి…ప్రస్తుతం విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా “సంతాన ప్రాప్తిరస్తు” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

3 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago