టాలీవుడ్

సముద్రుడు సినిమా ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. సుమన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ మరియు సినిమాలో ఉండే కామెడీ కథానుగుణంగా ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ నేపథ్యంలో నేడు ఫిల్మ్ ఛాంబర్ లో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తలకోన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, డైరెక్టర్స్ సముద్ర, ప్రముఖ నిర్మాతలు రామ సత్యన్నారాయణ, ముత్యాల రాందాస్, పీపుల్ మీడియా ఎగిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల శ్రీధర్, చిత్ర కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.

“మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. సముద్రమే వారి జీవనాధారం, అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం. ఈ చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నిర్మాత బధావత్ కిషన్ మాట్లాడుతూ : సముద్రుడు సినిమాని ప్రేక్షకులు ముందుకు ఈనెల 25న తీసుకొస్తున్నాం. ప్రేక్షకులందరికీ నచ్చే యాక్షన్ కామెడీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పూర్తిగా ఉన్నాయి. సుమన్ గారు క్యారెక్టర్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. కథలో దమ్ముంటే తెలుగు ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తారు. మా కథలో కూడా మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ, హీరో సుమన్ గారు, రాజ్ ప్రేమి, రామరాజు, శ్రవణ్, జబర్దస్త్ షేకింగ్ శేషు, చిత్రం శ్రీను, సమ్మెట గాంధీ, దిల్ రమేష్, ప్రభావతి, మోనల్, సుమన్ శెట్టి, బిహెచ్ఇఎల్ ప్రసాద్, తేజ శెట్టి, జూనియర్ రాజశేఖర్, ఫైజా జాన్ తదితరులు

టెక్నీషియన్స్ :
నిర్మాణం : కీర్తన ప్రొడక్షన్స్
నిర్మాత : బధావత్ కిషన్
సహ నిర్మాతలు : శ్రీ రామోజీ జ్ఞానేశ్వర్, సోములు నాయక్
సంగీతం : సుభాష్ ఆనంద్
డి ఓ పి : వాసు
ఎడిటర్ : నందమూరి హరి
ఫైట్స్ : నందు, సతీష్
కొరియోగ్రఫీ : అనీష్ శ్యామ్
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : నగేష్ నారదాసి
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago