▪️ఘనంగా ‘రోలుగుంట సూరి’ ప్రీ రిలీజ్ కార్యక్రమం
తెలుగు తెరపైకి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘రోలుగుంట సూరి’. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరోహీరోయిన్లుగా తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రీ రిలీజ్ కార్యకమాన్ని నిర్వహించింది.
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రియల్ స్టిక్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాను అద్భుతంగా చేశారని అభినందించడం మా చిత్ర యూనిట్ కు కొత్త ఎనర్జీ వచ్చింది. మ్యూజిక్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు లాంచ్ చేసిన మా సినిమాలోని పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. మా కృషిని, మా టీం టాలెంట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మా సినిమా టీమ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భరోసా ఇచ్చారు. ఇక మా సినిమా హీరో నాగార్జున పల్లా అథ్లెటిక్స్ లో నేషనల్ గోల్డ్ మేడలిస్ట్. సినిమా రంగంలో మంచి ఫ్యూచర్ ఉందని మా సినిమాలో యాక్టింగ్ టాలెంట్ తో నిరూపించుకున్నాడు. ఈ నెల 14న విడుదల అయ్యే ‘రోలుగుంట సూరి’ సినిమాను థియేటర్ కు వెళ్లి చూడాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.
హీరో నాగార్జున పల్లా మాట్లాడుతూ.. “నాకు ఇది ఫస్ట్ మూవీ. నేను స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను. చాలా ఇష్టపడి చేశాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇదే టీంతో మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి మాకు బ్లేసింగ్స్ ఇవ్వండి. ” అని కోరారు.
నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ –“’రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైంది. చిత్రయూనిట్‌లోని ప్రతి సభ్యుడు టాలెంట్ చూపించారు. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 14న థియేటర్ కు వెళ్లి సినిమా చూసి హిట్ చేయాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.” అని తెలిపారు.
లిరిక్ రైటర్ రామారావు మాతుమూరు మాట్లాడుతూ… “ఈ మూవీ లో ప్రణయ విరహ గీతం “నిన్న.. మొన్న..” అనే పాట రాసాను. ఈ పాటను అనూప్ రూబెన్స్ విడుదల చేసి అభినందించడం ఆనందంగా ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటను ప్రత్యేకంగా ప్రశంసించడం మర్చిపోలేని అనుభూతి.” అని అన్నారు.
తెలుగులో ఒక అరుదైన, అద్భుతమైన సినిమాగా ‘రోలుగుంట సూరి’ నిలిచిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేశారు.
సాంకేతిక విభాగం:
నటీనటులు: నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్, బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను చొప్ప తదితరులు
నిర్మాత: సౌమ్య చాందిని పల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఊరికూటి తాతారావు, పల్లా సత్యనారాయణ
దర్శకుడు: అనిల్ కుమార్ పల్లా
సంగీతం: సుభాష్ ఆనంద్
లిరిక్: రామారావు మాతుమూరు
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సందీప్ చక్రవర్తి
ఎడిటింగ్ , ఆడిషనల్ స్క్రీన్ ప్లే : ఆవుల వెంకటేష్
కథ, డైలాగ్స్: మహ్మద్ సాయి
ఫైట్స్: వాసు
ఆర్ట్ డైరెక్టర్: ఎస్. రమేష్
కో-డైరెక్టర్: సుభాష్
పబ్లిసిటీ డిజైన్: ఇమేజ్ 7 అడ్వర్టైజింగ్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal