బుల్లితెరపై ఆర్కే సాగర్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొగలి రేకులు సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ హీరోగా మారిపోయారు. సినిమాలతోనూ తన అభిమానుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ది 100’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కోసం రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తరుపున ఇప్పటికే సెలెబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ సైతం తన వంతుగా ప్రచారాన్ని చేపట్టారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు సాగర్ చేసిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది.
‘గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి’ అని సాగర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. రీసెంట్‌గానే మెగా మదర్ అంజనమ్మ చేతులు మీదుగా రిలీజ్ చేయించిన ది 100 టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…