ఇన్ కార్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి, ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా,  జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

ట్రైలర్ లో కాలేజీకి వెళ్లే అమ్మాయి కిడ్నాప్ చేసి, ఏకాంత ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేయాలని గూండాలు ప్లాన్ చేస్తారు. ఆమె వారి నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఆమెను తీవ్రంగా గాయపరుస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఆమెకు పోరాటం తప్పా మరో మార్గం లేదు.

హర్ష వర్ధన్ తన గ్రిప్పింగ్ కథనంతో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ఎంగెజింగా వుంది. రితికా సింగ్ ఎక్స్ టార్డినరీగా పెర్ఫార్మ్ చేసింది. నిజానికి అలాంటి పాత్రను అంగీకరించే దమ్ము ఉండాలి.

ఈ చిత్రానికి మిథున్ గంగోపాధ్యాయ సినిమాటోగ్రఫీ, మానిక్ దివార్ ఎడిటర్. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను సునీల్ రోడ్రిగ్స్ పర్యవేక్షించారు. ఇన్ కార్ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది.

తారాగణం: రితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా,  జ్ఞాన్ ప్రకాష్

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago