`రిస్క్’ టీజర్ ని విడుదల చేసిన శ్రీ మల్లు బట్టి విక్రమార్క

Must Read

రొటీన్‌ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే ప్రేక్షకులు ఆదరణ చూపిస్తారు. తరం ఏదైనా అలాంటి కథలనే దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన ‘6 టీన్స్’ సినిమాకు సీక్వెల్ గా కొత్త కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో వస్తున్న సినిమా `రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్’. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ (జి కె) స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే రాజీవ్ కనకాల,అనీష్ కురువిళ్ళ ఈ చిత్రంలో ప్రత్యేక నటన శైలితో కనిపించబోతున్నారు. యూట్యూబ్ లో సంచలం సృటించిన మనసా… చెలియా… వంటి వీడియో ఆల్బమ్స్ లో పాపులర్ అయినా సందీప్ అశ్వా హీరోగా, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సి ఎం క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ లో ఈ రోజు ఉదయం 11:11లకు టీజర్ ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్కమాట్లాడుతూ… ” రిస్క్టీజర్, పాటలు చూసాను, చాలా బాగున్నాయి. యువతరానికి సంబందించిన కంటెంట్‌ లా వుంది. చూస్తుంటే తప్పనిసరిగా అందరికి నచ్చుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రంలో మాటలు అన్నీ చాలా ఇన్ ట్రెస్టింగా.. పవర్‌ఫుల్‌గా వున్నాయి. అదే విధంగా పాటలు కూడా బాగున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు” అన్నారు.

నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ (జి కె) మాట్లాడుతూ… “తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా టీజర్ విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ‘6 టీన్స్’ సినిమాకు సీక్వెల్ గా, మర్డర్ మిస్టరీ కంటెంట్‌తో థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ నిచ్చే యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌తున్న ఈ చిత్రంలో అన్ని వ‌ర్గాల వారిని అల‌రించే అంశాలున్నాయి. టైటిల్‌కి తగ్గట్టుగా లైఫ్ గేమ్ లో యూత్ చేసే తప్పులు, పొరపాట్లు వలన ఎలాంటి రిస్క్ లో పడతారో ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని కలిగించే కథనంతో ఈ చిత్రం ఉంటుంది. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంద‌నే న‌మ్మ‌కం వుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు హై లెట్ గా నిలుస్తాయి ఆడియో రంగంలో సిద్ శ్రీరామ్, ఝావేద్ అలీ, భార్గవి పిళ్ళై వంటి టాప్ సింగర్స్ తో పాటలు పాడించాము. చిత్రాన్ని దసరా సెలవుల్లో సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలలో ఒకే సారి విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

హీరో సందీప్ అశ్వ మాట్లాడుతూ… నా తొలి చిత్రం రిస్క్ టీజర్ ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా వుంది. మినిస్టర్ గారికి థాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంత కలర్ ఫుల్ గా, ఎంటర్టైన్ గా వుండబోతోంది. ఈ సినిమాలో నేను, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్ లు ఎక్కడా బోర్ కొట్టించం, యంగ్ ఏజ్ లో వుండే జోష్ తో చేయకూడని పొరపాట్లు చేసి లైఫ్ రిస్క్ ఇరుక్కుంటాము. ఈ చిత్రంలో మంచి మ్యూజిక్, మంచి డైలాగ్స్, ఊహించని ట్విస్టులు వున్నాయి. సుద్దాల అశోక్ తేజ, వారికుప్పల యాదగిరి, ఘంటాడి కృష్ణ గారు చాలా మంచి పాటలు రాశారు. నా మొదటి సినిమాకే ఘంటాడి కృష్ణ గారినుండి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఘంటాడి కృష్ణ గారు చాలా హార్డ్ వర్క్ చేసారు. ఓ అనుభవమున్న దర్శకుడిగా అన్ని శాఖలు ప్రోపర్ గా చూసుకున్నారు.ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది.” అన్నారు.

హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ “ఈ రోజు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారితో కలసి, ఘంటాడి కృష్ణ గారు రూపొందించిన ఈ చిత్ర రిస్క్ టీజర్ విడుదల చేయడం సంతోషంగా వుంది. టీజర్ యూత్ ఫుల్ కంటెంట్ తో చాలా బాగుంది. అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఘంటాడి కృష్ణ గారి పాటలు మంచి మెలోడీ తో ఆకట్టుకునే ట్యూన్స్ ఉంటాయి. సిద్ శ్రీ రామ్ పాడిన లిరికల్ వీడియో సాంగ్ చూసాను విజువల్ గా, ఆడియో పరంగా అద్భుతంగా వుంది.” అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేష్, గడ్డం రవి, భవిష్ ఘంటాడి, తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు – సందీప్ అశ్వా,తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్, సన్య ఠాకూర్, జోయా ఝవేరి, అనీష్ కురువిళ్ళ, రాజీవ్ కనకాల, కాదంబరి కిరణ్ కుమార్, దువ్వాసి మోహన్, ‘జబర్దస్త్’ అప్పారావు, ‘జబర్దస్త్’ రాజమౌళి, ‘జబర్దస్త్’ రాము, టార్జాన్, భాగ్య లక్ష్మి, మహేందర్, శ్వేతా తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి
నిర్మాత,రచన,సంగీతం,దర్శకత్వం: ఘంటాడి కృష్ణ (జి కె)
డిఓపి: జగదీష్ కొమరి,
ఎడిటర్‌: శివ శార్వాణి,
పాటలు : సుద్దాల అశోక్ తేజ, వరికుప్పల యాదగిరి, ఘంటాడి కృష్ణ,
స్టంట్ : శేఖర్ మాస్టర్,
ఆర్ట్ : మురళి,
కాస్ట్యూమ్స్ డిజైనర్ : శ్రీమతి శైలజ
కొరియోగ్రఫీ : రఘు, అజయ్ సాయి, వెంకట్ దీప్, అజ్జు, మెహర్,
కో – డైరెక్టర్ : బన్సీ కోయల్కర్
ప్రొడక్షన్ డిజైనర్ : రాహుల్,
పబ్లిసిటి డిజైనర్‌: ఈశ్వర్
పీఆర్‌ఓ & కో-ఆర్డినేటర్ : రాంబాబు వర్మ లంకా

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News