ఆరాధ్య దేవితో ఆర్జీవి నూతన చిత్రం ‘శారీ’….

Must Read

ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే రామ్‌గోపాల్‌ వర్మ టాలెంట్‌ని వెతికి పట్టుకోవటంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఆయన ఎంతోమంది టాలెంట్‌ ఉన్న నటీనటులను భారతదేశానికి అందించారు.

స్త్రీ అంటే నాకు విపరీతమైన అభిమానం అని చెప్పే ఆర్జీవి ఆడవాళ్లు కట్టుకునే ‘శారీ’ని తన కొత్త సినిమా టైటిల్‌గా పెట్టి మరో అమ్మాయిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. యాధృశ్చికంగా ఒక ఇన్‌స్టా రీల్‌లో చూసి కేరళ అమ్మాయిని ‘శారీ’ కి సెలెక్ట్‌ చేసి సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు.

ఆ శారీ భామ పేరు ‘ఆరాధ్యదేవి’. ఆమె ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవి డెన్‌ టాలెంటెడ్‌ ఫోటోగ్రాఫర్‌ యశ్వంత్‌ క్లిక్‌ మనిపించంగా రామ్‌గోపాల్‌ వర్మ మీడియాకి తన హీరోయిన్‌ని స్వయంగా పరిచయం చేశారు.

Latest News

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’...

More News