ప్రముఖ దర్శక, నిర్మాత రమేష్ వర్మ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు గానూ ‘ఆర్‌వి ఫిల్మ్ హౌస్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఆర్‌వి ఫిల్మ్ హౌస్ ప్రొడక్షన్ కంపెనీ మీద నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ‘కొక్కొరొకో’ని ఆదివారం (ఆగస్ట్ 31) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ రోజు జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు షాట్‌కు నిర్మాత రేఖ వర్మ క్లాప్ కొట్టగా.. నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రమేష్ వర్మ స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీనివాస్ వసంతలకు అందజేశారు. ఈ మూవీతో శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
వినూత్నమైన కథతో, డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా శ్రీనివాస్ వసంతల ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ప్రముఖ స్క్రీన్ రైటర్ జి. సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ నేపథ్య గాయకుడు జివి సాగర్ ఈ మూవీకి సంభాషణలు రాసే బాధ్యతను స్వీకరించారు. తన తండ్రి వారసత్వాన్ని అనుసరించి ‘రాక్షసుడు’ తర్వాత రచయితగా రెండో ప్రాజెక్ట్‌ని సాగర్ చేపట్టారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఆకాష్ ఆర్ జోషి, లండన్‌కు చెందిన ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సంకీర్తన్ పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని రేఖ వర్మ, కూరపాటి శిరీష నిర్మాతలుగా.. నీల్లాద్రి ప్రొడక్షన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా ప్రవీణ్ పూడి పని చేయనున్నారు.
ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను రమేష్ వర్మ స్వయంగా రూపొందించారు. ఆర్‌వి ఫిల్మ్ హౌస్ బ్యానర్‌లో మొదటి చిత్రంగా తెలుగులో ఓ చక్కటి ఆంథాలజీ కానుందని, అద్భుతమైన విజువల్స్, మంచి ఎమోషన్స్‌తో ‘కొక్కొరొకో’ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…