టాలీవుడ్

రాక్షస కావ్యం” సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ మంగ్లీ, రామ్ మిర్యాల పాడిన విలన్స్ ఆంథెమ్ రిలీజ్

రాక్షస కావ్యం” సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, రామ్ మిర్యాల పాడిన విలన్స్ ఆంథెమ్ రిలీజ్

నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి విలన్స్ ఆంథెమ్ ను రిలీజ్ చేశారు.

కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ ప్రమోషనల్ సాంగ్ కు ఆర్.ఆర్ ద్రువన్ ట్యూన్ కంపోజ్ చేశారు. ముగ్గురు టాప్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, రామ్ మిర్యాల, మంగ్లీ ఈ పాటను పాడారు. డీలో డిల్లెలో డీలో డిల్లెలో హీరో ఎవడు విలన్ ఎవడు జిందగీలో…డీలో డిల్లెలో డీలో డిల్లెలో..సెడ్డోడెవడు మంచోడెవడు బోలో బోలో…అంటూ మనుషుల వ్యక్తిత్వాలను ప్రశ్నిస్తూ అర్థవంతమైన లిరిక్స్ తో సాగుతుందీ పాట. విలన్స్ గురించి ప్రత్యేకంగా ఈ పాటను డిజైన్ చేయడం విశేషం.

మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

నటీనటులు – నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ అండ్ కలరిస్ట్ – వెంకటేష్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ – రుషి కోనాపురం
సంగీతం – రాజీవ్ రాజ్, శ్రీకాంత్,ఆర్.ఆర్ దృవన్
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
సాహిత్యం – కాసర్ల శ్యామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉమేష్ చిక్కు
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి
కో ప్రొడ్యూసర్స్, నవీన్ రెడ్డి, వసుంధర దేవి
పీఆర్వో – జి.ఎస్.కె మీడియా
నిర్మాతలు – దాము రెడ్డి, శింగనమల కల్యాణ్
రచన, దర్శకత్వం – శ్రీమాన్ కీర్తి

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

14 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago