వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ మెటిరిరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచాయి.తాజాగా ఈ చిత్రం నుండి ‘కమ్మగుంటదే’ పాటని నేచురల్ స్టార్ నాని చేశారు. ఆర్పీ పట్నాయక్ ఈ పాటని అందమైన జానపద మెలోడి స్టయిల్ లో కంపోజ్ చేశారు. వినగానే మనసుని ఆకట్టుకునేలా వుందీ పాట.
ఈ పాటలో అభిరామ్, గీతికా ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కాల భైరవ, కీర్తన శ్రీనివాస్ ఈ పాటని లవ్లీగా ఆలపించారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు’కమ్మగుంటదే’ పాట కూడా ఫోక్ చార్ట్ బస్టర్ గా అలరిస్తోంది.ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.ఈ చిత్రం త్వరలోనే థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: శంకర్
సిజి: నిఖిల్ కోడూరి
పీఆర్వో: వంశీ-శేఖ
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…