మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియట్” సినిమాను నిర్మిస్తున్నారు. “పెళ్లి సందడి” చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు “మిస్టర్ ఇడియట్” టీజర్ ను రవితేజ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
“మిస్టర్ ఇడియట్” టీజర్ ఎలా ఉందో చూస్తే – ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో చదివే సత్య (హీరోయిన్ సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ గీస్తే ది బెస్ట్ గా నిలవాల్సిందే. కాలేజ్ లో సత్య మెరిట్ ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి టైమ్ లో కాలేజ్ లో అడుగుపెడతాడు హీరో (మాధవ్). సత్యను న గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తుంటాడు. హీరోయిన్ ను హీరో న గుణింతంతో ఎందుకు పిలుస్తున్నాడు? అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ రవితేజలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. స్టైలిష్ లుక్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్టర్ ఇడియట్” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు – మాధవ్, సిమ్రాన్ శర్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ – రామ్
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ – విప్లవ్
పీఆర్వో – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం – గౌరి రోణంకి
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…