‘రావణాసుర’ చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. రవితేజ గారిని, నన్ను చాలా కొత్తగా చూస్తారు: సుశాంత్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సుశాంత్ రావణాసుర విశేషాలని విలేకరులు సమావేశంలో పంచుకున్నారు.
‘రావణాసుర’ మీరా రవితేజ గారా ?
‘సుశాంత్ యాజ్ రామ్’ని రావణాసుర పోస్టర్ రిలీజ్ చేశారు. రావణాసుర టైటిల్ రోల్ రవితేజ గారు చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే గ్రే షేడ్స్ అందరికీ వున్నాయి. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ట్యాగ్ లైన్ వుంది. మరి ఇందులో రాముడు ఎవరో.. రావణాసురుడు ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రావణాసుర చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుంది.
మీరు థ్రిల్లర్ చేయడం ఇదే మొదటిసారి కదా ?
అవును.. ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో కొంత థ్రిల్లర్ వుంటుంది. కానీ కంప్లీట్ థ్రిల్లర్ మాత్రం రావణాసురనే. ఇందులో కొత్తగా కనిపించే అవకాశం వచ్చింది. ఈ సినిమా చేయడానికి కారణం అదే. వెర్సటైల్ యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. రావణాసురలో ఆ కొత్తదనం కనిపిస్తుంది.
రావణాసుర కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?
అభిషేక్ గారు ఫోన్ చేసినపుడు.. ఒక కథ రెడీ చేసి సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను. అభిషేక్ గారికి కూడా అదే చెప్పాను. కానీ కథ విన్నపుడు మాత్రం చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ప్రేక్షకుడిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. నా పాత్ర చాలా కీలకంగా వుంది. సినిమా అంతా వుంటుంది. దీనికి మరో డైమెన్షన్ తోడైతే బావుంటుదని చెప్పాను. సుధీర్ వర్మ గారికి కూడా అది నచ్చి చాలా ఫాస్ట్ గా వర్క్ చేసి నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా ఆ డైమెన్షన్ ని తీసుకొచ్చారు. మరో లేయర్ యాడ్ అయ్యింది. రవితేజ గారికి కూడా ఇది చాలా నచ్చింది. నేను అనుకున్న దాని కంటే చాలా బాగా వచ్చింది.
రవితేజ గారితో కాంబినేషన్ సీన్ల్ ఎలా వుంటాయి ?
ఖచ్చితంగా థియేటర్లో చాలా ఆసక్తికరంగా వుంటాయి. రవితేజ గారిని కొత్తగా చూపించారు. నన్ను కొత్తగా చూపించారు. సీన్స్ అన్నీ ఇంట్రస్టింగా ఎక్సయిటింగ్ వుంటాయి.
నిర్మాత అభిషేక్ గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ?
అభిషేక్ గారితో గ్రేట్ జర్నీ. నిజానికి ఈ సినిమాలో ఈ పాత్రని నన్ను తీసుకోవాలనే ఆలోచన కూడా ఆయనిదే. ఈ సందర్భంగా అభిషేక్ గారి కృతజ్ఞతలు.
ఇందులో మీ పాత్ర నుంచి ప్రేక్షకులు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారాని భావిస్తున్నారు ?
ఎక్స్ పెక్ట్ కంటే ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిట్ మెంట్ వుంది. చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ వినలేదు చూడలేదు. అందుకే కథ వినగానే ఓకే చేశాను. ప్రేక్షకులు కూడా ఈ కొత్తదనం ఫీలౌతారు.
మీరు ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవున్నాయి ? అయితే సినిమాలు మాత్రం చాలా సెలెక్టివ్ గా.. గ్యాప్ తీసుకొని చేస్తున్నారని అనిపిస్తుంది?
అక్కినేని కుటుంబం నుంచి రావడం నా అదృష్టం. అయితే నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకు వెళ్లాను. కొన్ని సినిమాలు ఆలస్యం కావడం, అనుకున్న సమయానికి రాకపోవడం ..ఇలా నా చేతుల్లో లేనివి కూడా కొన్ని జరిగాయి. ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందని కొన్ని సార్లు నాకే తెలియలేదు. అయితే ఇంత గ్యాప్ వచ్చిన నా మైండ్ లో ఎప్పుడూ నెక్స్ట్ సినిమా చేస్తున్నామనే స్ఫూర్తి వుండేది. చిలసౌ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని అని బలంగా నిర్ణయించుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది. దీంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది. అయితే గత ఆరు నెలలుగా చాలా బిజీగా వున్నాను. సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను. ఇంకొన్ని కథలు వింటున్నా.
‘అల వైకుంఠపురములో’ తర్వాత మీ కెరీర్ మరో మలుపు తీసుకుందని అనుకోవచ్చా ?
‘అల వైకుంఠపురములో’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నార్త్ లో కూడా ఫేం తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అయితే నేను అన్నీ చేయలేదు. రావణాసుర, భోళా శంకర్.. ఇలా ఎక్సయిట్ చేసిన సినిమాలు మాత్రమే చేశా.
కొత్తగా చేస్తున్న సినిమాలు
సోలో హీరో గా ఈ ఏడాది ఒక సినిమా వుంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నా.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…