“రామన్న యూత్” ట్రైలర్ విడుదల. ఈ నెల 15న మూవీ రిలీజ్

Must Read

హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా “రామన్న యూత్” ట్రైలర్ విడుదల. ఈ నెల 15న మూవీ రిలీజ్

Raamanna Youth Trailer | Naveen | Kamran | Madhura Audio

టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో సిద్ధార్థ్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన “రామన్న యూత్” సినిమా ట్రైలర్ బాగుందన్న హీరో సిద్ధార్థ్ ..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా

హీరో సిద్దార్ధ్ మాట్లాడుతూ – “రామన్న యూత్” టైటిల్ క్యాచీగా ఉంది. అభయ్ నా ఫేవరేట్ యంగ్ యాక్టర్. తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింలో అభయ్ యాక్టింగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. తరుణ్ కు ఫోన్ చేసి మాట్లాడా. అభయ్ లో మంచి యాక్టర్, రైటర్ ఉన్నాడని చెప్పాడు. తర్వాత నా చిన్నా సినిమాలో ఓ కీ రోల్ అభయ్ చేశాడు. ఈ సినిమాలో ఒక కథను కాకుండా తను లైఫ్ లో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్ చూశాను ఫన్ ఉంది. అలాగే ఫన్ వెనక ఒక ఎమోషన్ ఉంది. ఎక్కడైనా యూత్ గెలవాలి. ఈ సినిమా నెక్ట్ వీక్ థియేటర్ లోకి వస్తోంది. థియేటర్ లోనూ రామన్న యూత్ గెలవాలి. నేను థియేటర్ లో ఈ సినిమా చూస్తా. మిమ్మల్ని చూడమని కోరుతున్నా. ఎందుకంటే నేను ఇలా చిన్నవాడిగా ఇండస్ట్రీకి వచ్చాను. ఇలాంటి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయమని కోరుతున్నా. అన్నారు.

హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన హీరో సిద్ధార్థ్ గారికి కృతజ్ఞతలు. ఒక ఊరిలో రాజకీయ నాయకుడిగా ఎదగాలని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి అనేది సినిమాలో ఆకట్టుకునేలా చూపిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. ఈ నెల 15న “రామన్న యూత్” చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ట్రైలర్ లాగే సినిమా కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

నటీనటులు :
అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.

సాంకేతిక నిపుణులు :

కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, ప్రతిభ రెడ్డి

సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి

ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్

ఆర్ట్ – లక్ష్మీ సింధూజ

సంగీతం – కమ్రాన్

సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే

పీఆర్వో – జీఎస్ కే మీడియా

రచన దర్శకత్వం – అభయ్ నవీన్.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News