డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

Must Read

“యంగ్ అండ్ డైనమిక్”, “మా రాముడు అందరివాడు” వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “రామభద్రుడు”. శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ 14వ సినిమా నుంచి ప్రతిభ గల కొత్త నటీనటులకు ఆహ్వానం పలుకుతూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. ఈ ఆడిషన్స్ కు భారీ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక నటీనటులు దాదాపు 500 మంది ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. వీరిలో సెలెక్ట్ అయిన వారితో దర్శక నిర్మాతలు అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. ఇక నెల్లూరులో ఈ సినిమా ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో అభిరామ్ హోటల్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు హీరో శ్రీరామ్ తెలిపారు. ఆసక్తి గల నటీనటులు మీ పోర్ట్ ఫోలియా, వీడియోస్ ను 9347209006, 9849680717 నెంబర్స్ కు వాట్సాప్ చేయవచ్చు లేదా sriramulup1991@gmail.com మెయిల్ చేయవచ్చు. లోకల్ టాలెంట్ కు తమ సినిమాలో మంచి అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ పేర్కొన్నారు.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నెల్లూరులో చేయబోతున్నారు. “రామభద్రుడు” చిత్రానికి మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గా వరప్రసాద్ నిర్మిస్తుండగా సుందర్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నటీనటులు – తనికెళ్ల భరణి, నాగ మహేష్, సమ్మెట గాంధీ, చిత్రం శీను, చిట్టిబాబు, సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, క్రాంతి, తదితరులు

టెక్నీషియన్స్

ప్రొడక్షన్ మేనేజర్ – రాహుల్ యాదవ
కో డైరెక్టర్స్ – రవీందర్ రెడ్డి
అసిస్టెంట్ డైరెక్టర్ – మనోహర్
మ్యూజిక్ – బొల్లా వెంకటేష్
కో ప్రొడ్యూసర్ – సుందర్ రాజ్
ప్రొడ్యూసర్ – దుర్గా వరప్రసాద్
డైరెక్టర్ -మహేష్ భాగ్యరాజ్

Latest News

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ AI ఆధారిత...

More News