అంచనాల మధ్య ఆగస్టు 1న ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రం నుండి మొదటి పాట ఈ రోజు విడుదలైంది.
‘రం రం ఈశ్వరం’ అని మొదలయ్యే ఈ శివ స్తుతి పాట లిరికల్ వీడియోని సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసారు.
“రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
వం గంగాధరం” అంటూ సాగే శివ స్తుతికి తగ్గట్టుగా హిప్నోటైజ్ చేసేలా మ్యూజిక్ సెట్ అవ్వడంతో ఈ పాట విడుదలైన కొంత సేపటికే అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన లభించింది. వివిధ వయసులు, ప్రాంతాలు, మతాల వారు కూడా ఈ పాట వింటుంటే శివ ధ్యానంలోకి జారినట్టుగా అనిపించడం, భక్తి తన్మయత్వంలో వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అని చెబుతుండటంతో నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి చాలా సంతోషంగా ఉన్నారు.
వికాస్ బడిస ట్యూన్ చేసిన ఈ పాటకి రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించగా, సాయి చరణ్ పాడారు. కథలో కీలకమైన ఘట్టంలో రానున్న ఈ పాటకి తగ్గట్టుగా కట్టిపడేసే విజువల్స్ ఉంటాయని నిర్మాత తెలిపారు.
అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరో – హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ నటించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు ఆఖరి దశలో ఉన్న మా ‘శివం భజే’ చిత్రం ఆగస్టు 1న బ్రహ్మాండమైన విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా, ప్రమోషన్స్ లో భాగంగా మొదటి పాట ”రం రం ఈశ్వరం” ని సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఈ రోజు విడుదల చేశారు. శివ స్తుతితో సాగే ఈ పాట విడుదలైన కొంతసేపటికే అన్ని వైపుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. పాట వింటూ ఉంటే తెలీకుండా శివ ధ్యానంలోకి వెళుతున్నట్టుగా తన్మయత్వంతో వింటున్నామని కొందరు చెప్పడం చాలా సంతోషంగా అనిపించించింది. మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస నేపథ్య గీతం, పాటలు ఈ చిత్రానికి చాలా బలమవుతాయి. పాటకి తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరథి విజువల్స్ కూడా అదే స్థాయిలో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వైవిధ్యమైన కథతో పాటు ఇండస్ట్రీ అగ్ర నిపుణులు, ఉన్నతమైన సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి చిత్రం ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించాం. హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, ఇతర నటీ నటులు కూడా ఈ చిత్ర విజయంపై చాలా నమ్మకంతో ఉన్నారు. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో ప్రతీ అప్డేట్ కి అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ విడుదల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.
నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు.
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై…
Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati…
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో చిత్రీకరించిన 'ఏలా అల తీపికోరే పూలతోట' పాట విడుదల అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన…
The Indian film industry continues to embrace cutting-edge technology, with filmmakers increasingly integrating advanced visual…
Written and Directed by K. Praful Chandra, 'Keep The Fire Alive' is being presented by…
లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నమే "కీప్ ది ఫైర్ అలైవ్". ఇది 1 నిముషం 25 సెకండ్ల షార్ట్…