ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా కనిపించారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించారు. నిన్న(శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చిన “రామ్ నగర్ బన్నీ” సినిమా యునానమస్ గా ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెబుతున్నారు. చంద్రహాస్ బాగా నటించాడని, డ్యాన్స్ లు , ఫైట్స్ బాగా చేశాడని చెబుతున్నారు. 100 పర్సెంట్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. అందుకు మీడియా వారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇంత మంచి టాక్ వస్తున్నప్పుడు మూవీకి మరిన్ని థియేటర్స్ పెంచుకోవడం అవసరం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని థియేటర్స్ లో “రామ్ నగర్ బన్నీ” సినిమా అందుబాటులోకి వస్తుంది. ఇంతమంచి సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. శని, ఆదివారాలు మరింత మంది మా “రామ్ నగర్ బన్నీ” సినిమాను చూస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ రిచా జోషి మాట్లాడుతూ- “రామ్ నగర్ బన్నీ” సినిమాకు అన్ని చోట్ల నుంచీ మంచి టాక్ వస్తోంది. రివ్యూస్ చాలా బాగున్నాయి. మా మూవీ రిలీజ్ ముందు ప్రతి కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఎలా వచ్చిందో..ఇప్పుడు థియేటర్స్ లోనూ అలాంటి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీ షో కు వచ్చిన వారంతా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈ వీకెండ్ లో ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడండి. అన్నారు.
హీరోయిన్ రీతు మంత్ర మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నేను మలయాళంలో మూవీస్ చేస్తున్నాను. తెలుగులో నా ఫస్ట్ మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మా చంద్రహాస్ బాగా నటించకుంటే మేము కూడా అంత బాగా పర్ ఫార్మ్ చేసి ఉండేవారం కాదు. డ్యాన్స్, ఫైట్స్, లవ్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీరు కోరుకునే ప్రతి అంశం ఈ మూవీలో ఉంది. చూడని వారు వెంటనే థియేటర్స్ కు వెళ్లి చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ అంబికా వాణి మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమాకు వస్తున్న టాక్ తో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. మంచి రివ్యూస్ వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమా చూస్తున్న వారంతా తమకు మూవీ బాగా నచ్చిందని అంటున్నారు. ఈ సినిమా కోసం మళయజ గారు, ప్రభాకర్ గారు ఎంతో కష్టపడ్డారు. రామ్ నగర్ బన్నీ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమాలే సక్సెస్ కోసం ఎంతో శ్రమిస్తున్నాయి. అలాంటిది కొత్త హీరో, కొత్త నిర్మాత, చిన్న బడ్జెట్ లో రామ్ నగర్ బన్నీ మూవీని రూపొందించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సక్సెస్ ను మాకు అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత మళయజ ప్రభాకర్ మాట్లాడుతూ – “రామ్ నగర్ బన్నీ” సినిమా సక్సెస్ మీట్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మా మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. సాధారణంగా సినిమాలకు కలెక్షన్స్ బాగున్నాయి అంటారు కానీ మా సినిమాకు యునానమస్ గా మంచి సినిమా చేశారనే టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఫస్ట్ సినిమాతో మా అబ్బాయి చంద్రహాస్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందటం సంతోషంగా ఉంది. అన్నారు.
హీరో చంద్రహాస్ మాట్లాడుతూ – మా “రామ్ నగర్ బన్నీ” సినిమాకు మంచి రివ్యూస్ ఇస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఎక్కడో ఒకరు తప్ప మిగతా వారంతా మూవీ చాలా బాగుందనే రాశారు. నేను మా సినిమా నచ్చకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని ప్రామిస్ చేశా. 95 పర్సెంట్ ప్రేక్షకులకు మూవీ నచ్చింది. ఈ సినిమా నా డెబ్యూ మూవీ కాబట్టి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుని చేశాను. నెక్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగా, రాజమౌళి గారు నాకు అవకాశాలు ఇచ్చేలా పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. ఇకపై రామ్ నగర్ బన్నీ లాంటి కమర్షియల్ మూవీస్ చేయను. మా సినిమాకు అన్ని థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. నేను అన్ని ఎమోషన్స్ చేయగలను అనే షో రీల్ లా సినిమా ఉందని అంటున్నారు. నేను నటుడిగా ప్రూవ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. తప్పకుండా థియేటర్స్ కు వెళ్లండి రామ్ నగర్ బన్నీతో మీరంతా ఎంటర్ టైన్ అవుతారని ప్రామిస్ చేస్తున్నా. అన్నారు.
నటీనటులు – చంద్రహాస్, విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని, తదితరులు
టెక్నికల్ టీమ్
పబ్లిసిటీ డిజైన్ – మ్యానీ
ఆర్ట్ డైరెక్టర్ – రాజశేఖర్
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ- అష్కర్ అలీ
మ్యూజిక్ డైరెక్టర్ – అశ్విన్ హేమంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయ్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – దివిజ ప్రభాకర్
నిర్మాతలు – మళయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ
రచన, దర్శకత్వం – శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్)
Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…
మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్. అమ్మ…
The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…
తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…
Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…