ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ల్యాండ్ స్కెప్ లు మారుతున్నప్పటికీ సందర్బోచితంగా ఎప్పటికప్పుడు కొత్త తరంతో పయనిస్తూ చిత్రాలు నిర్మించడంలో ముందుంటారు దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ. 90వ దశకం లో కొత్త సినిమా యుగానికి శ్రీకారం చుట్టిన మార్గదర్శకుల్లో ఒకరైన దూర ద్రుష్టి గల దిగ్గజ దర్శకుడు, ఇప్పటికి తాను చూసే ప్రపంచాన్ని ప్రశ్నించే, ప్రతిబింబించే, ప్రతిస్పందించే చిత్రాలను నిర్మించగలిగారు.
తెలుగు రాష్ట్రాల రాజాకీయాలను అన్వేషించి అనేక చిత్రాలను రూపొందించారు. డిఫరెంట్ కంటెంట్‌లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. తాజాగా ఈ విలక్షణ దర్శక, నిర్మాత ‘శారీ’ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. టైటిల్ కి ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనే లాగ్ లైన్ కూడా జోడయింది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ‘శారీ’ని ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘శారీ’ చిత్రం రూపొందుతోంది.
అమ్మాయిలపై ఎన్నో యాసిడ్ దాడులు చూసివున్నాము. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లో ‘శారీ కిల్లర్’ అమాయకులైన ఎంతో మంది మహిళలను అతి క్రూరంగా మానభంగం చేసి చిత్ర హింసలకు గురిచేసి హత్యలు చేయడం జరిగింది. ఆ మృగాడి కి మగువలపై ఎంతటి తీవ్రమైన కాంక్ష ఉండేదో వాడి చర్యలు తెలియచేస్తాయి. ఈ అంశాల ఆధారంగానే శారీ చిత్రం రూపొందిందిది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్ గా… ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఇందులోని ప్రధానాంశం. ఇందులో అబ్బాయిగా సత్య యాదు నటిస్తూండగా, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. ఆరాధ్య దేవి కేరళకు చెందిన అమ్మాయి- ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది. ఆర్జీవీ డెన్ అనగానే అంతా కార్పోరేట్ స్టైల్ ఉంటుంది. అక్కడ శారీ ధరించే అమ్మాయి పాత్ర కోసం ఆరాధ్య దేవిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం! నిజానికి ఆరాధ్యను రామ్ గోపాల్ వర్మ ఎవరో తనకు ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్ లో తొలుత చూశారు. ఈ అమ్మాయి అయితే ‘శారీ’లో బాగుంటుందని సూచించారు. ఇన్ స్టాలో ఆయనకు వచ్చిన రీల్ లో తొలుత ఆయన దృష్టిని ఆరాధ్య ఆకర్షించింది. ఇక శారీలోని అమ్మాయిని చూసి ఉద్రేకం చెందే అబ్బాయి పాత్రకు సత్య యాదును కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ క్రమం లో ఈ రోజు ఉదయం 11గంటలకు హైదరాబాద్ ఆర్ జి వి డెన్ లో టీజర్ విడుదల చేయడం జరిగింది.
నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి తదితరులు
సినిమాటోగ్రఫీ : శబరి,
నిర్మాత : రవి వర్మ,
దర్శకుడు : గిరి కృష్ణ కమల్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా…
After creating a wave of excitement with the pre-look reveal of Rebel Star Prabhas last…
మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు.…
Dulquer Salmaan, a multilingual actor and prominent star of Indian cinema, has been known for…
Mahendragiri Vaarahi is the production number 2 film under Rajashyamala banner. Glimpses of this film…
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబరు - 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల…