జపాన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ‘రంగస్థలం’ రికార్డుల వేట…

జపాన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ‘రంగస్థలం’ రికార్డుల వేట… దిమ్మతిరిగే కలెక్షన్లు

జపాన్‌లో మొదటి రోజే రికార్డులు తిరగరాస్తున్న రంగస్థలం

జపాన్ డిస్ట్రిబ్యూటర్ స్పేస్ బాక్స్ సీఈవో అంబరసి దురైపాండ్యన్

జపాన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి తాజాగా రిలీజ్ చేసిన రంగస్థలం కలెక్షన్లే నిదర్శనం. రంగస్థలం సినిమాకు తెలుగులో వచ్చిన ప్రశంసలు అందరికీ తెలిసిందే. రామ్ చరణ్‌ నటనకు , సుకుమార్ టేకింగ్, మేకింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చిట్టి బాబు పాత్రను రామ్ చరణ్‌ తప్ప మరే ఇతర హీరో చేయలేనంతగా నటించేశారు రామ్ చరణ్. ఇక కలెక్షన్ల పరంగానూ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేశారు.

రామ్ చరణ్ కెరీర్‌లో రంగస్థలం సినిమా మైల్ స్టోన్ లాంటిది. చిట్టి బాబు పాత్రలో చెవిటి వాడిగా అద్భుతంగా నటించారు రామ్ చరణ్. అంత వరకు ఎన్నడూ చూడని సరికొత్త రామ్ చరణ్‌ను సుకుమార్ చూపించారు. ఎంతో ఇంటెన్సిటీతో, మరెంతో ఎమోషనల్ పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరుకు అవార్డులు సైతం గులాం అయ్యాయి. రామ్ చరణ్‌ సరసన నటించిన సమంతకు సైతం మంచి పేరు వచ్చింది. రామ్ చరణ్‌, సమంత కెమిస్ట్రీ కూడా సినిమా విజయంలో భాగమైంది.

జూలై 14న ఈ సినిమా జపాన్‌లో రిలీజైంది. మొదటి రోజు ఈ సినిమాను డెబ్బై స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తే 2.5 మిలియన్ల యెన్స్ వచ్చాయి. జపాన్‌ డిస్ట్రిబ్యూటర్, స్పేస్ బాక్స్ సీఈవో అంబరసి దురైపాండ్యన్ మాట్లాడుతూ… ”మేం ఈ సినిమాను ముందుగా యాభై స్క్రీన్స్లో రిలీజ్ చేశాం. మున్ముందు మరిన్ని స్క్రీన్లు పెంచబోతోన్నాం. జపాన్ ప్రేక్షకుల్లో రామ్ చరణ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రంగస్థలం సినిమాకు వచ్చిన రియాక్షనే దానికి నిదర్శనం. రంగస్థలం లాంటి సినిమాలను జపాన్ ప్రేక్షకులకు అందించడం ఎంతో సంతోషంగా ఉంది. స్పేస్ బాక్స్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. నిజంగానే ఇది మాస్టర్ పీస్” అని అన్నారు.

స్పేస్ బాక్స్ ద్వారా ఇప్పటికే జపాన్‌లో 250కి పైగా భారతీయ చిత్రాలను రిలీజ్ చేశారు. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల చిత్రాలను జపాన్‌లో విడుదల చేశారు. బజరంగీ భాయీజాన్, అంధాదున్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, బ్యాంగ్ బ్యాంగ్, సూపర్ 30, మాస్టర్, ఖైదీ, వారిసు, వాల్తేరు వీరయ్య, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ఇలా చాలా సినిమాలను విడుదల చేశారు.

రంగస్థలం సినిమాతో రామ్ చరణ్‌ ఓ సంపూర్ణమైన నటుడిగా పేరు సంపాదించుకున్నారు. మగధీర, ధృవ, రంగస్థలం వంటి సినిమాలు రామ్ చరణ్‌ను టాప్ స్టార్‌గా నిలబెట్టాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో జపాన్‌లోనూ తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. రామ్ చరణ్‌ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. రామ్ చరణ్‌ మేనియాతో జపాన్‌లో రంగస్థలం కలెక్షన్లు రోజురోజుకూ పెరిగేలా ఉన్నాయి.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago