డ‌బ్బింగ్ ప‌నులు షురూ చేసిన రామ్ చరణ్ “గేమ్‌ఛేంజ‌ర్‌” టీమ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌, వస్తోన్న అప్డేట్లతో  గేమ్ ఛేంజ‌ర్‌పై మరింత హైప్ ఏర్పడింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ ఏడాది క్రిస్మ‌స్ కి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్ప‌డ‌మే కాదు, ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తీసుకొస్తున్నారు నిర్మాత‌లు.

తాజాగా గేమ్ ఛేంజ‌ర్ డ‌బ్బింగ్ ప‌నులు షురూ అయ్యాయి. పూజా కార్య‌క్ర‌మాల‌తో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టారు. ఆల్ సెట్ ఫ‌ర్ ద మెగా ఫైర్ వ‌ర్క్స్ – క్రిస్మ‌స్ 2024 అంటూ డ‌బ్బింగ్ ప్రారంభించిన విష‌యాన్ని పంచుకున్నారు మేక‌ర్స్.

విన‌య విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్  క‌నిపిస్తోంది గేమ్ ఛేంజ‌ర్ యూనిట్ లో.

ఆమ‌ధ్య  గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను రూపొందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.

న‌టీ న‌టులు:
రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్
నిర్మాణ సంస్థ‌లు: శ‌్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, జీ స్టూడియోస్‌
నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌
రైట‌ర్స్‌:  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్‌
స్టోరీ లైన్‌:  కార్తీక్ సుబ్బ‌రాజ్‌
కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్‌
సినిమాటోగ్ర‌ఫీ:ఎస్‌.తిరుణావుక్క‌ర‌సు
మ్యూజిక్‌:  త‌మ‌న్.ఎస్‌
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
లైన్ ప్రొడ్యూస‌ర్స్‌: న‌ర‌సింహారావ్‌.ఎన్‌,  ఎస్‌.కె.జ‌బీర్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  అవినాష్ కొల్ల‌
 యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌:  అన్బ‌రివు
డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌:  ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ ర‌క్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ
లిరిసిస్ట్‌:  రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌, కాస‌ర్ల శ్యామ్‌
ఎడిట‌ర్‌:  షామీర్ ముహ్మ‌ద్
సౌండ్ డిజ‌న‌ర్‌:  టి.ఉద‌య్‌కుమార్‌
పి.ఆర్.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)
డిజిటల్ మీడియా: నాని

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago