‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తోన్న ”రామ్ చ‌ర‌ణ్‌”

ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో వ‌ర‌ల్డ్ వైప్ పాపులారిటీ ద‌క్కించుకున్నారు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న యువీ క్రియేష‌న్స్‌లోని త‌న స్నేహితుడు విక్ర‌మ్ రెడ్డితో చేతులు క‌లిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను ఈ సంస్థ రూపొందించ‌నుంది. అదే స‌మ‌యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వేదిక‌గా మారుతుంది.

నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌లో విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌తో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్ష‌కులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. సినీ నిర్మాణంలో అసాధార‌ణ‌మైన ఆస‌క్తి తో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌దనాన్ని అందించాల‌నే ఆలోచ‌న ఉన్న టీమ్ ఆధ్వ‌ర్యంలో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగ‌నుంది. సినీ ప‌రిశ్ర‌మలో ఎవ‌రూ గుర్తించ‌ని ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించాల‌నే దానికి క‌ట్టుబ‌డి ఉంది.

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్ష‌ణ‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ స‌రికొత్త‌, వైవిధ‌మ్యైన వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌టానికి సిద్దంగా ఉన్నాం. సృజ‌నాత్మ‌క‌త‌తో సినిమా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి ఓ స‌రికొత్త ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు.

యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ‘‘ఈ స‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌టం అనేది మాలో తెలియ‌ని ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో క‌లిసి “వి మెగా పిక్చ‌ర్స్” ప‌ని చేయ‌నుంది. వెండితెర‌పై చూపించ‌బోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకు రావాల‌నుకుంటున్నాం. దీని వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ హ‌ద్దులు చెరిపేయ‌ట‌మే మా ల‌క్ష్యం’’ అన్నారు.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago