అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న ‘రాకాస’.. ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల

అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ‘రాకాసా’ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను వేయనుంది. ఈ చిత్రం యూఎస్ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ‘రాకాస’ ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో రిలీజ్ కాబోతోండటంతో అక్కడి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి.

ఓవర్సీస్ పంపిణీల్లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్‌కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘రాకాస’ టైటిల్ ప్రకటన, గ్లింప్స్ తరువాత పెరిగిన బజ్, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ‘రాకాస’పై ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

https://www.instagram.com/reel/DUvPdfskeL9

‘రాకాస’ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇదొక విజువల్ వండర్‌గా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుంది. కెమెరామెన్ అందించిన విజువల్స్, బీజీఎం గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకున్నారు. టెక్నికల్ పరంగా ‘రాకాస’కి మంచి పేరు లభించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ‘రాకాస’ యూనిట్ పోస్ట్-ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఎడిట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ వంటి వాటిపై టీం పని చేస్తోంది. గతంలో విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ‘రాకాస’ నేషనల్ వైడ్‌గానే కాకుండా ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ బజ్‌ను క్రియేట్ చేసింది.

‘రాకాస’లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ల తర్వాత సంగీత్ ‘రాకాస’తో మళ్లీ హిట్టు కొట్టేందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి అద్భుతమైన నటీనటులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి మానస శర్మ రచన, దర్శకత్వం వహించారు. మానస శర్మ, సంగీత్ శోభన్‌తో మానస శర్మ తీసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఈ టీం కలిసి వస్తోంది. ఇక ఈ ‘రాకాస’ చిత్రాన్ని Z స్టూడియోస్ సమర్పిస్తుండగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని దక్కించుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది.

TFJA

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

3 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago