ఈ మధ్యకాలంలో ఇలాంటి క్యూట్ టీజర్ చూడలేదు.. యూత్‌ఫుల్‌గా.. ఎంతో ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న సినిమాలా అనిపిస్తుంది. ఈ చిత్రంలో తప్పకుండా సమ్‌థింగ్ స్పెషల్ వుంటుందనిపిస్తుంది అని అంటున్నారు రాజమండ్రి రోజ్ మిల్క్ టీజర్‌ను వీక్షించిన ప్రేక్షకులు. జై జాస్తి, అవంతిక జంటగా నటిస్తున్న చిత్రం రాజమండ్రి రోజ్‌మిల్క్ నాని బండ్రెడ్డి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ఇంట్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.
దర్శకుడు మాట్లాడుతూ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. కాలేజి రోజుల్లో మరపురాని సంఘటనలను, మధురానుభూతులను ఈ చిత్రం అందరికి జ్ఞప్తికి తెస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది అన్నారు. సన్నీల్‌కుమార్, వెన్నెలకిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్,డిఓపీ: శక్తి అరవింద్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…