రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్ సాధిస్తోంది. ఈ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లో 20 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది. “రాజా సాబ్” ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్ కు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ ప్రభాస్ క్రేజ్, స్టార్ డమ్ సత్తాను మరోసారి ప్రూవ్ చేస్తోంది. “రాజా సాబ్” ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ లో ప్రభాస్ వింటేజ్ స్టైలిష్ రొమాంటిక్ లుక్ ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్ చేస్తోంది.
ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను రూపొందిస్తున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ స్కేల్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. “రాజా సాబ్” సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నారు.
నటీనటులు – ప్రభాస్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
వీఎఎఫ్ఎక్స్ – ఆర్.సి. కమల్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా, వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…