భలే ఉన్నాడే’ మంచి కంటెంట్ తో వస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ :డైరెక్టర్ మారుతి

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ రూపొందిస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందే ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

చీర కట్టే వృత్తిని ఎంచుకున్న రాధగా రాజ్ తరుణ్ పాత్రను పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతను అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. బైక్‌పై అబ్బాయిలా కూర్చోవడాన్ని కూడా ఇష్టపడడు. అయితే, మనీషా కంద్కూర్ అతనిని ఇష్టపడుతుంది. తనతో ప్రేమలో పడుతుంది. ఈ ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది కథలో కీలకాంశం.

జె శివసాయి వర్ధన్ ఒక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని, రాజ్ తరుణ్‌ని హిలేరియస్ పాత్రలో ప్రజెంట్ చేశాడు. ఇలాంటి  సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు రాజ్ ని అభినందించాలి.  అతని కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంది. మనీషా కంద్కూర్ కూడా తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ స్నేహితుడిగా హైపర్ ఆది కనిపించాడు. ఇతర ప్రముఖ హాస్యనటుల ప్రజెన్స్ చూస్తుంటే ఈ చిత్రంలో ఎంటర్ టైమెంట్ అదిరిపోతుందని అర్ధమౌతోంది.  

నగేష్ బనెల్లా కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలవగా, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామెడీ పోర్షన్ ని ఎలివేట్ చేశారు. బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై టీజర్ పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ తో మంచి ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. దర్శకుడు సాయికి ఈ పాయింట్ చెబితే తను చాలా బాగా డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు. నిర్మాత కిరణ్ గారు కూడా కథ నచ్చి ప్రాజెక్ట్ లో వచ్చారు. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే ఫిల్మ్ అని భావిస్తున్నాను. ఇది మన మధ్యలో జరిగే ఒక కథలా వుంటుంది. మనిషా చాలా చక్కగా నటించింది. శివసాయి చాలా పాషన్ వున్న దర్శకుడు. ప్రతి విషయంలో చాలా క్లియర్ గా పెర్ఫెక్ట్ గా వుంటాడు. శేఖర్ చంద్ర మంచి పాటలు ఇచ్చారు. ఇద్దరు డీవోపీలు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. దాదాపు ఇండస్ట్రీలో వున్న ఆర్టిస్ట్ లందరూ వున్నారు. తమిళ్ నుంచి కూడా వీటీ గణేషన్ లాంటి నటులు తీసుకొచ్చారు. మంచి కంటెంట్ తో రాబోతుంది ఈ సినిమా. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా అవ్వబోతుంది. రెండు రీళ్ళు చూశాను. ఫ్లో చాలా బావుంది.  పరిశ్రమలో కి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ నిర్మాతలకు స్వాగతం. చిన్న సినిమాలు ఎప్పటికీ బావుండాలి. నేను ఎంత పెద్ద సినిమాలు చేస్తున్నా .. చిన్నసినిమాతోనే వచ్చాను కాబట్టి ఆ సినిమాలు వదలకుండా ట్రావెల్ అవుతున్నాను. ఈ సినిమా కూడా బాగా ఆడితే ఇంకా ఎనర్జీ వస్తుంది. ఈటీవీ విన్, ఆదిత్య మ్యూజిక్ కి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ తెలిపారు

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. శేఖర్ చంద్ర చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మరో రెండు సినిమాలకి కూడా తనతో అగ్రీమెంట్ రాయించుకున్నా.(నవ్వుతూ)  డీవోపీ నగేష్ బానెల్లాతో ఇది నా మూడో సినిమా. ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటే ఇప్పటికి కుదిరింది. అది ఈ సినిమా కావడం చాలా ఆనందంగా వుంది. నన్ను ఇంతగా నమ్మిన ఆయనకి ధన్యవాదాలు. దర్శకుడు శివసాయి నేను పని చేసిన దర్శకుల్లో ఒక బెస్ట్ డైరెక్టర్. తనతో మళ్ళీ కలసి పని చేయాలని వుంది.  టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి’ అన్నారు.

చిత్ర దర్శకుడు జె శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాకి ఆద్యుడు మారుతి గారు. ఈ సినిమాకి ఆయన హార్ట్. ఆయనకి ధన్యవాదాలు. ఆయన వలనే నా కల నెరవేరింది. నిర్మాత కిరణ్ గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మిన రాజ్ తరుణ్ గారికి ధన్యవాదాలు. శేఖర్ చంద్రగారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నగేష్ బానెల్లా వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు

డైరెక్టర్ సుబ్బు మాట్లాడుతూ.. మేమంతా మారుతి గారి టీం నుంచి వచ్చాం. ఈ కథ గురించి నాకు తెలుసు. కిరణ్ గారు ఖర్చుకి వెనకాడకుండా చాలా గ్రాండ్ గా తీశారు. సినిమా చాలా రిచ్ గా వుంటుంది. రాజ్ తరుణ్ చాలా కొత్త పాత్రలో అలరిస్తాడు. టీజర్ చాలా బావుంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్” అన్నారు.

డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. టైటిల్ చూస్తుంటే భలే భలే మగాడివో వైబ్ కనిపిస్తుంది. రాజ్ తరుణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మారుతి టీం ప్రోడక్ట్ ఒక బ్రాండ్. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖచ్చితంగా గొప్పగా అలరిస్తుంది. సినిమా పెద్ద హిట్ కావాలి. అవుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే మారుతిగారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో షాకింగ్ కామెడీ వుంటుంది. చాలా కొత్తగా ఉండబోతుంది. కంటెంట్ తో వుండే సాంగ్స్ వున్నాయి. చాలా కొత్తగా ప్రయత్నించాం. దర్శకుడు శివగారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. రాజ్ తరుణ్ తో ఇది నా మూడో సినిమా. తప్పకుండా ఈ సినిమా అందరినీ నచ్చుతుంది’ అన్నారు.

నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన మారుతి గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బావొచ్చింది. దర్శకుడు అద్భుతంగా తీశారు. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు

తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: జె శివసాయి వర్ధన్
ప్రెజెంట్స్: మారుతీ టీమ్
నిర్మాత: N.V కిరణ్ కుమార్
బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్
DOP: నగేష్ బానెల్లా
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
ఆర్ట్: సురేష్ భీమగాని
ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago