రాజ్ తరుణ్, రమేష్ కడుములు, కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి మూవీ గ్రాండ్ గా ప్రారంభం

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా ప్రారంభ పూజ ఈరోజు రామానాయుడు వీడియోస్ లో ఘనంగా జరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుములు ని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్  నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ , నక్కిన త్రినాధ రావు , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల  తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిని త్రినాధరావు  ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.  

మూవీ లాంచింగ్ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల మాట్లాడుతూ… ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. కంటిన్యూ షూటింగ్ వుంటుంది. అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది  క్రైమ్ కామెడీ. స్వామిరారా, అంధధూన్  తరహాలో వుంటుంది. కథ చాలా అద్భుతంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఎస్ కే ఎన్ గారికి, మారుతి గారికి, నక్కిన త్రినాధరావు రావు గారికి, వంశీ గారికి, అలాగే ధీరజ్ మొగలినేని గారికి ఆయన ధన్యవాదాలు’ తెలిపారు.

ప్రొడ్యూసర్ కేఐటిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ… కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్ కి వెళ్తున్నాం.  ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  

మాధవి అద్దంకి మాట్లాడుతూ…. దర్శకులు రమేష్ చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా కథ, కథనం చాలా అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా ప్లాట్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్ రాశి ఆప్ట్. ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు’ తెలిపారు.

హీరోయిన్ రాశీ సింగ్ సినిమా మాట్లాడుతూ… ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కథ విన్నప్పుడు నా పాత్ర చాలా నచ్చింది. రాజ్ తరుణ్ తో కలసి నటించడం ఆనందంగా వుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు’ తెలిపారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. పూజాకార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఇది చాలా మంచి కథ. క్రైమ్ కామెడీ జోనర్. నా ఫేవరట్ జోనర్. మీ అందరికీ ఆశీర్వాదం కావాలి’ అన్నారు

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్  శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, ఆదిత్య జవ్వాడి డీవోపీగా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ కాగా, ‘బేబీ’ సురేష్ బీమగాని ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం : రాజ్ తరుణ్, రాశి సింగ్
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి
రచన & దర్శకత్వం : రమేష్ కడుముల
ప్రొడ్యూసర్ : మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్
డిఓపి : ఆదిత్య జవ్వాడి
సంగీతం : శేఖర్ చంద్ర
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ : బేబీ సురేష్ బీమగాని
వీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్ : సుధీర్

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago