ప్రణయ గోదారి గ్లింప్స్‌ని విడుదల చేసిన నిర్మాత రాజ్‌ కందుకూరి

రొటీన్‌ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే నేటి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఎటువంటి పాత్రనైనా చాలా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో తన ప్రత్యేక నటన శైలితో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. సునిల్ రావినూతల ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్రం డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ పెదకాపు లుక్‌ను శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ… ప్రణయగోదారి గ్లింప్స్‌ చాలా బాగుంది. కంటెంట్‌ చూస్తుంటే తప్పనిసరిగా అందరికి నచ్చుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రంలో సాయికుమార్ డైలగ్స్ అన్నీ చాలా ఇన్ ట్రెస్టింగా.. పవర్‌ఫుల్‌గా వున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ… ‘రాజ్‌కందుకూరి గారి చేతుల మీదుగా గ్లింప్స్‌ విడుదల చేయడం ఆనందంగా వుంది.
ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌తున్న ఈ చిత్రంలో అన్ని వ‌ర్గాల వారిని అల‌రించే అంశాలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని కలిగించే కథతో వ‌స్తోంది. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో క‌నిపిస్తాయి. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంద‌నే న‌మ్మ‌కం వుంది. చిత్రాన్ని త్వరలోనే విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ప్రణయగోదారి సినిమా గ్లింప్ల్‌ చూస్తుంటే.. సన్నివేశాలు.. సంభాషణలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. .కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో పెదకాపు పాత్రలో ఊరి పెద్దలాగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగులు… ‘తప్పు ఎవరు చేసినా తీర్పు ఒక్కటే’…’ఆకాశానికి హద్దుండదు ఈ పెదకాపు మాటకు తిరుగుండదు’……. ‘నే పుట్టిన ఈ గోదారి తల్లి మీద ఒట్టు’ అని సాయికుమార్ తన పవరఫుల్ డైలాగులతో మెస్మరైజ్ చేశాడు. ‘ప్రాణం పోయినా సహిస్తాను….భరిస్తాను …నా సహనాన్ని.. మంచితనాన్ని పరీక్షించొద్దు’ అనే డైలాగుతో చాలా రౌద్రంగా కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన పాత్రలోని గంభీరత్వం కూడా కనిపిస్తుంది. గ్లింప్స్‌ను చూస్తే సినిమా మొత్తానికి సాయికుమార్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా తెలుస్తుంది. గోదారి నది ఒడ్డున హీరో హీరోయిన్ల ఆటలు, వారి ప్రేమాయణం సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రంలో యువతను అలరించే అంశాలు కూడా వున్నట్లు తెలుస్తుంది.

సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:మార్కండేయ, కెమెరా:ఈదర ప్రసాద్, చీఫ్ కోడైరెక్టర్:జగదీష్ పిల్లి, డిజైనింగ్:టీఎస్ఎస్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్:గంట శ్రీనివాస్, కొరియోగ్రాఫీ:కళాధర్,మోహనకృష్ణ,రజిని, ఎడిటర్:కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్:విజయకృష్ణ, కాస్ట్యింగ్ డైరెక్టర్:వంశీ ఎమ్.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago