“పుష్ప 2” సక్సెస్ తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రశ్మిక మందన్న

Must Read

తన కెరీర్ లో మెమొరబుల్ ఇయర్ 2024కు సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది నేషనల్ క్రష్ రశ్మిక మందన్న. ఈ ఏడాది ఆమె “పుష్ప 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్ లోనూ కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది “పుష్ప 2”. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రశ్మిక పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. రశ్మికకు ఎంతోమంది కొత్త అభిమానులను సంపాదించిపెట్టింది.

“పుష్ప 2” తో పాటు రశ్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన రశ్మిక నటిస్తున్న సికిందర్ సినిమా కూడా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాలో నటించడం కూడా రశ్మికకు 2024 మిగిల్చిన ఒక మంచి మెమొరీ. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ కు సెండాఫ్ ఇస్తూ మరో సెన్సేషనల్ స్టార్ట్ కోసం 2025 కు వెల్ కమ్ చెప్పేందుకు రశ్మిక క్యూరియస్ గా వెయిట్ చేస్తోంది.

Latest News

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్...

More News