సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి లీడ్ రోల్ లో ఓ మూవీ చేస్తున్నారు. సురేష్ కొండేటి హీరోగా అభిమాని అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమాను అనౌన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‍లైన్ తోనే సినిమా తెరకెక్కింది. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‍కే రహ్మాన్, మరియు కంద సాంబశివరావు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, అభిమాని చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సురేష్ కొండేటి పుట్టిన రోజు (అక్టోబర్ 6) సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజ్ అయింది.
ఈ సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ “ఇప్పుడే సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ చూడడం జరిగింది. చాలా బాగుంది. ‘అభిమాని’ అనే టైటిల్ చాలా ఆరోగ్యకరంగా, చాలా బాగుంది. అక్కడే సినిమా సగం విజయం సాధించింది. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఈ మూవీ తీశారని అనుకుంటున్నాను. ఇక సురేష్ కొండేటి గురించి చెప్పాలంటే, తాను నాకు జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండే తెలుసు. అక్కడి నుండి తన ప్రయాణం జర్నలిస్ట్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా, ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగిన తీరు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్‌కు మంచి పేరు తీసుకురావాలి, హీరోయిన్‌కి ఈ మూవీలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు రావాలని, నటుడిగా సురేష్ కొండేటి బిజీ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్స్‌కి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరి హీరోల అభిమానులు ఈ మూవీ చూసి మంచి విజయం అందించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ అల్ ది బెస్ట్ సురేష్” అన్నారు.
అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ” నేను డైరెక్ట్ చేసిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా విడుదల కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ లో సురేష్ కొండేటి గారు ప్రధాన పాత్రలో నటించారు. యముడిగా అజయ్ ఘోష్ గారు నటించారు, నానమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ గారు నటించారు, చిత్రగుప్తుని పాత్రలో ఎస్.కె రెహమాన్ గారు నటించారు.హీరోయిన్‌గా అక్సాఖాన్ నటించారు, మరో పాత్రలో జై క్రిష్ నటించారు .నా మీద ఎంతో నమ్మకంతో ప్రధాన పాత్ర చేయడానికి ఒప్పుకున్న సురేష్ కొండేటి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా మీద నమ్మకంతో సినిమాను ప్రొడ్యూస్ చేసిన SK రెహమాన్ గారికి, కందా సాంబశివరావు గారికి చాలా, చాలా థాంక్స్ . అలాగే మా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
అక్సాఖాన్: మాట్లాడుతూ* ” నేను నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా విడుదల కావడం మా టీం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సర్. మీ అభిమానం మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సురేష్ కొండేటి గారు నటించారు. సురేష్ సర్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సురేష్ సర్ నాకు చాలా ఏళ్ల నుండి తెలుసు, అప్పటి నుండి నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఇక ముందు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్, నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసినందుకు. అలాగే మా టీంకి ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
సురేష్ కొండేటి మాట్లాడుతూ* ” దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది.
పంపిణీ దారుడిగా నా కెరీర్ మొదలైందే రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’తో…
ఆ సినిమాతోనే రాజమౌళిగారు దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఆ సినిమా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో నేను పంపిణీ చేశాను.
ఘన విజయాన్ని సాధించిన ఆ సినిమా నాకు పంపిణీదారుడిగా బలమైన పునాదిని వేసింది. ఆ క్రమంలోనే ఆ తర్వాత పలు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. నిర్మాతగానూ మారాను .
అలా ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్న నన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది రాఘవేంద్రరావు గారే.
స్టూడెంట్ నంబర్ వన్ వచ్చి మొన్న సెప్టెంబర్ 27కి 23 సంవత్సరాలైంది. సరిగ్గా అదే రోజున ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలైంది. రాఘవేంద్రరావు గారు నాకెందుకు ఇష్టం అంటే…ఆయన ఫాదర్ కె.యస్. ప్రకాశరావు గారు పెద్ద పేరున్న దర్శకుడు అయినా… ఆయన పేరును వాడుకోకుండా…
పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర, వి. మధుసూదనరావు గారి దగ్గర ఆయన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. 1975 మే 2 వచ్చిన ‘బాబు’ మూవీతో డైరెక్టర్ అయ్యారు.
అంటే దర్శకుడిగా ఆయన వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు.
వచ్చే యేడాదికి డైరెక్టర్ గా స్వర్ణోత్సవం జరుపుకోబోతున్నారు.
యాభై యేళ్ళుగా దర్శకత్వం వహిస్తూ, వందకు పైగా సినిమాలు తీసినా..
ఇప్పటికీ ఆయన నిత్య విద్యార్థిగానే వ్యవహరిస్తారు.
కొత్త నటీనటులను, యువ దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తుంటారు.
గైడ్ చేస్తుంటారు. ఎవరు ఏ సలహా కోసం వచ్చిన ఓర్పుగా వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు. ఆయన తెలుగు సినిమా రంగంలో లివింగ్ లెజెండ్. రాఘవేంద్రరావుగారు అందుకోని విజయం లేదు.
వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు.
ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి వాళ్ళకు గ్రాండ్ సక్సెస్ లు ఇచ్చారు. ఏకంగా నాలుగు తరాలతో కలిసి పనిచేశారు.
ఎంతో మంది కొత్త అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేశారు.
శ్రీదేవి మొదలు కొని ఎంతోమంది హీరోయిన్లకు స్టార్ డమ్ ను కట్టబెట్టారు.
తెలుగులోనే కాదు… బాలీవుడ్ లోనూ విజయ పతాకాన్ని ఎగరేశారు.
ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనదే సువర్ణ అధ్యాయం.
అలాంటి రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా… నేను ప్రధాన పాత్ర పోషించిన ‘అభిమాని’ సినిమా గ్లింప్స్ విడుదల కావడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. గతంలో నేను కొన్ని సినిమాలలో నటించినా… అవన్నీ ఒక ఎత్తు… ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నాది ప్రధాన పాత్ర.
సో… రాఘవేంద్రరావు గారి ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయాన్ని పొందుతుందని, నటుడిగా నేను మరో స్థాయికి చేరుకోవడానికి ఆ విజయం దోహదం చేస్తుందని భావిస్తున్నాను.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…