టాలీవుడ్

100వ వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులోర‌క్త‌దానం చేసిన న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకుకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి ర‌క్త‌నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాల‌ను నిల‌బెట్టిన బ్ల‌డ్ బ్యాంక్ స్థాప‌కులు మెగాస్టార్ చిరంజీవికి అండ‌దండ‌గా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్ర‌మే.

వంద‌లాది మెగాభిమానులు అందిస్తోన్న స‌పోర్ట్‌తో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకు నిరంత‌ర సేవ‌ల‌ను అందిస్తోంది.

ఈ బ్ల‌డ్ బ్యాంకుకి వెన్నుద‌న్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ ఒక‌రు.

మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ స్టార్ట్ అయిన‌ప్పుడు ర‌క్త‌దానం చేసిన తొలి వ్య‌క్తి ముర‌ళీ మోహ‌న్‌.. రెండో వ్య‌క్తి మ‌హ‌ర్షి రాఘ‌వ కావ‌టం విశేషం.

ఇప్పుడు మ‌హ‌ర్షి రాఘ‌వ 100వసారి ర‌క్త‌దానం చేయ‌టం గొప్పరికార్డు .

100వ సారి ర‌క్త‌దానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.

అయితే అనుకోకుండా 100వ సారి మ‌హ‌ర్షి రాఘ‌వ ర‌క్త‌దానం చేసే స‌మ‌యంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు.
హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న విష‌యం తెలుసుకుని మ‌హ‌ర్షి రాఘ‌వ‌ను ప్ర‌త్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనం గా సత్కరించారు .

ఆయ‌న‌తో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన ముర‌ళీ మోహ‌న్‌ను కూడా క‌ల‌వ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వీరితో పాటు మ‌హ‌ర్షి రాఘ‌వ స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి కూడా స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీస‌ర్ శేఖ‌ర్‌, చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంకు సీఓఓ ర‌మ‌ణ‌స్వామి నాయుడు, మెడిక‌ల్ ఆపీస‌ర్ డాక్ట‌ర్ అనూషగారి ఆధ్వ‌ర్యంలో మ‌హ‌ర్షి రాఘ‌వ ర‌క్త‌దానం చేశారు.

ఈ సంద‌ర్భంలో మ‌హ‌ర్షి రాఘ‌వ‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా అభినందించారు. అలాగే ఆయ‌న స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి ఆప‌ద్బాంధ‌వుడు చిత్రంలో న‌టించిన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

మూడు నెల‌ల‌కు ఓ సారి లెక్క‌న 100 సార్లు ర‌క్త‌దానం చేయ‌టం గొప్ప‌విష‌య‌మ‌ని ఇలా ర‌క్త‌దానం చేసిన వ్య‌క్తుల్లో మ‌హ‌ర్షి రాఘ‌వ ప్ర‌ప్ర‌థ‌ముడని చిరంజీవి అభినందించారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

5 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago