100 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్‌ పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తకిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌.. ఇక డిసెంబరు 6న థియేటర్స్‌లో ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే.. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’లో అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేసిన అంతకు మించి తగ్గేదేలేలా పుష్ప-2 వుండబోతుందని హింట్‌ ఇస్తున్నారు మేకర్స్‌… ఇక డిసెంబరు 6న అందరూ డబుల్‌ మార్క్‌ చేసుకొని రెడీ వుండడి.

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

4 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago