అదిరిపోయే సంగీతం… మెస్మరైజ్ చేసే విజువల్స్… హైక్లాస్ మేకింగ్.. ఊరమాస్ స్టెప్స్… క్లాప్ కొట్టించే ఐకాన్‌స్టార్ స్వాగ్… వినగానే వావ్ అనిపించే లిరిక్స్.. ఇలా ఒకటేమిటి.. పుష్ప… పుష్ప…పుష్ప.. పుష్పరాజ్.. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిలే.. ఈ పాట వింటూంటే అందరికి గూజ్‌బంప్స్.. ఇక ఐకాన్‌స్టార్ అభిమానుల సంబరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎస్… అందరూ ఎంతో ఎదురుచూస్తున్న పుష్ప-2 ది రూల్ లోని తొలి లిరికల్ వీడియో వస్తున్న అప్లాజ్ అది.. పుష్ప… పుష్ప…పుష్ప.. పుష్పరాజ్.. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిలే.. అనే లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు మేకర్స్… చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాట హై మాసివ్‌గా పూర్తి కమర్షియల్‌గా సాంగ్‌గా వుంది. చిత్రంలో పుష్ప ది రూల్‌ను ఎలివేట్ చేసే విధంగా, పుష్ప క్యారెక్టరైజేషన్ మీద సాంగ్ వుంది. వినగానే అందరికి ఈ పాట ఎంతో నచ్చే విధంగా వుంది. విజయ్ పొల్లంకి, శ్రేష్టి వర్మ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుదల చేశారు. తాజాగా వదిలిన ఈ పాటతో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబరాల్లో వున్నారు.
2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…