‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది.
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు..
ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ‘పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పుష్ప -2 చిత్రం నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా, ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ విడుదలైన రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది. టీజర్‌తో పాటు ఇటీవల విడుదలైన పుష్ప పుష్ప పుష్పరాజ్, టైటిల్ సాంగ్, కపుల్ సాంగ్‌గా విడుదలైన రెండో లిరికల్ సాంగ్ సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ.. ఎంతటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మొదట ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తున్నామని ప్రకటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. షూటింగ్ పార్ట్‌తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్‌గా మరింత అత్యున్నత విలువలతో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలనే వుద్దేశంతో సినిమా విడుదల తేదిని మార్చినట్లు తెలిపారు మేకర్స్.
ఇక ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో తన నటనతో
మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడమ్ టుసార్ట్స్‌లో దక్షిణ భారతదేశ నటుడి స్టాట్యూని, గ్యాలరీని ఏర్పాటు చేయటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఇలాంటి ప్రత్యేకతలు ‘పుష్ప’ చిత్రంతోనే సంతరించుకున్నాయి. ఇక త్వరలో
‘పుష్ఫ 2: ది రూల్’తో మరోసారి ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారు. 90 సంవత్పరాల తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి తెలుగు నటుడి నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయంటే.. ‘పుష్ప’ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్–
Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in…
నటుడు యోగేష్ పాన్ ఇండియన్ ఫిల్మ్ "త్రిముఖ"తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు, ఇందులో నాజర్, సిఐడి ఆదిత్య…
ZEE5 లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ ట్రైలర్ విడుదల చేసిన యంగ్ హీరో విశ్వక్ సేన్.. నరేష్ అగస్త్య, మేఘా…
~ Telangana's first detective series, ‘Vikkatakavi’ premieres on November 28 on ZEE5 ~ ~ Produced…
The movie Dhoom Dhaam stars Chetan Krishna and Hebah Patel in the lead roles. Sai…
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్,…