థింక్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేసిన పూర్వాజ్

Must Read

“శుక్ర”, “మాటరాని మౌనమిది” వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శక నిర్మాత పూర్వాజ్. ఆయన ప్రస్తుతం “ఏ మాస్టర్ పీస్” అనే భారీ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ , అషు రెడ్డి, స్నేహ గుప్త కీ రోల్స్ లో నటిస్తున్నారు. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ సినిమాల నిర్మాణంలో భాగమైన పూర్వాజ్…తాజాగా ‘థింక్ సినిమా’ ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించారు.

థింక్ సినిమా బ్యానర్ ద్వారా కంటెంట్ ఉన్న మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నట్లు ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ తెలిపారు. ఈ సంస్థ మొదటి సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభమై వచ్చే ఏడాది జూలైలో విడుదలకు తీసుకొస్తామని పూర్వాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా

దర్శక నిర్మాత పూర్వాజ్ మాట్లాడుతూ – మేము గతంలో పలు పైలట్ ఫిలింస్, వెబ్ మూవీస్ చేశాం. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ చిత్రాల నిర్మాణంలో భాగమయ్యాం. ఆ ప్రాజెక్ట్స్ లతో ప్రొడక్షన్ లో వచ్చిన అనుభవంతో సొంత నిర్మాణ సంస్థ థింక్ సినిమాను ప్రకటిస్తున్నాం. మా సంస్థలో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసి ఒక మంచి బ్యానర్ గా స్థిరపడాలని ఆశిస్తున్నాం. థింక్ సినిమా సంస్థలో మొదటి సినిమా ఈ ఏడాది ప్రారంభించి వచ్చే ఏడాది జూలైలో విడుదల చేస్తాం. అన్నారు.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News