రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందించారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో “పురుషోత్తముడు” సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీడియా నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. రాజ్ తరుణ్ ఫోన్ లో మాట్లాడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వంటి అభిరుచి గల ప్రొడ్యూసర్స్ ఉండటం వల్లే “పురుషోత్తముడు” వంటి మూవీ చేయగలిగాం. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ గారి పాత్రలకు మంచి అప్లాజ్ వస్తోంది. పూల రైతుల సమస్యను తెరపై చూపించడం అనేది ఒక కొత్త నేపథ్యం, కొత్త ప్రయత్నం అనే ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ హీరోతో చేస్తే మా మూవీ మరింత బ్లాక్ బస్టర్ అయ్యేది అనే మాటలు వినిపిస్తున్నాయి. మేము కంటెంట్ ను బిలీవ్ చేశాం. అది బాగుంటే ప్రేక్షకులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని నమ్మాం. ఇవాళ థియేటర్ లో ప్రేక్షకులు అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ కూడా మా మూవీని పంపిస్తాం. మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.
నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ – మా “పురుషోత్తముడు” సినిమా నిన్న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజైంది. అన్ని చోట్ల నుంచి మా సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేశారనే ప్రశంసలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. మా డైరెక్టర్ రామ్ గారికి ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చూసేంత క్లీన్ మూవీస్ ఈ మధ్య రావడం లేదు. “పురుషోత్తముడు”తో అలాంటి ప్రయత్నం చేశాం. మా సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా స్టార్ కాస్టింగ్ ఉన్నారు. వాళ్ల పాత్రలకు మంచి స్పందన వస్తోంది. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు “పురుషోత్తముడు” సినిమా చూపించాలి. జీవితంలో ఎలా ధర్మంగా బతకాలో ఈ సినిమా నేర్పిస్తుంది. మా మూవీలో అసభ్యత, అశ్లీలత అనే మాటే వినిపించదు. ఐటెం సాంగ్స్, ఎక్స్ పోజింగ్ కు అవకాశం ఉన్నా మేము పెట్టలేదు. “పురుషోత్తముడు” 2 ప్లాన్స్ ఇప్పుడే లేవు. అయితే త్వరలో ఓ స్టార్ హీరోతో భారీ సినిమా నిర్మించే సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమాలో నేను అమ్ములు క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. స్క్రీన్ మీద అందంగా ఉన్నానని చెబుతున్నారు. లంగావోణి కట్టుకుంటే తెలుగు ఆడియెన్స్ కు అందంగా కనిపించకుండా ఎలా ఉంటాను. ఈ పాత్ర కోసం ఏడాదిగా కాస్ట్యూమ్స్, మేకోవర్, వర్క్ షాప్స్ చేశాను. ఆ రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమా కథ విన్నప్పుడే విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని అనుకున్నాను. మరో కాస్ట్లీ లొకేషన్ కు వెళ్లేందుకు ప్రొడ్యూసర్ ఒప్పుకున్నా..మా డైరెక్టర్ రామ్ గారు కడియపులంకలోనే మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అది దర్శకుడిగా ఆయనలోని జెన్యూనిటీకి నిదర్శనం. డైరెక్టర్ గారి ప్లానింగ్ వల్లే “పురుషోత్తముడు” సినిమాలో విజువల్స్ కు అంత మంచి పేరు వస్తోంది. అన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…