సినీరంగంలో సరైన శిక్షణవ్యక్తిత్వవికాసంలో ఒక భాగం!!

Must Read

-“గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి” అధినేత
టాలీవుడ్ లీడింగ్ క్యాస్టింగ్ డైరెక్టర్
ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్
దీపక్ బలదేవ్ ఠాకూర్

“సిల్వర్ జూబిలీ”కి చేరువలో
గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి!!

సినిమా రంగంలో శిక్షణ కేవలం ఆ రంగంలో రాణించడానికి మాత్రమే కాకుండా… ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కు ఎంతగానో దోహదపడుతుందని అంటున్నారు గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి అధినేత – టాలీవుడ్ లీడింగ్ క్యాస్టింగ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ “దీపక్ బలదేవ్ ఠాకూర్”. సినిమా రంగంతో అత్యంత సన్నిహిత అనుబంధం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన దీపక్… ఈ రంగాన్ని కెరీర్ గా మలచుకోవాలని బాల్యంలోనే ఫిక్స్ అయిపోయారు. కమల్ హాసన్, నాగార్జున వంటి సూపర్ స్టార్స్ ను తీర్చి దిద్దిన సుప్రసిద్ధ నట శిక్షణాలయం “ఆశా కె.చంద్ర ఫిల్మ్ ఇనిస్టిట్యూట్”లో తర్ఫీదు పొందిన బలదేవ్… అదే ఇనిస్టిట్యూట్ లో అసిస్టెంట్ ఫ్యాకల్టీగానూ పని చేయడం గమనార్హం. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్, వైభవ్ రెడ్డి (కోదండరామిరెడ్డి తనయుడు) వంటి వారితో ఇంటరాక్ట్ అవుతూ మోటివేట్ అయిన ఠాకూర్… హైద్రాబాద్ లో అందరికీ అందుబాటులో సరైన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లేకపోవడాన్ని గుర్తించి… ఫిల్మ్ అకాడమి స్థాపించానని చెబుతారు.

స్క్రిప్ట్ డిమాండ్ కు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేయడంలో సిద్ధహస్తులైన దీపక్… తన వద్ద శిక్షణ పొందినవారు సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో స్థిరపడేవరకు వారికి మార్గదర్శకత్వం వహిస్తారు. మరో రెండేళ్లలో “సిల్వర్ జూబిలీ”కి చేరువలో ఉన్న “గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి”ని భారతదేశంలోని అత్యున్నత శిక్షణాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని చెబుతారు. “క్యాస్టింగ్ డైరెక్షన్” పరంగానూ విలువలతో కూడిన ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలన్నది తన ధ్యేయమని చెప్పే ఈ ఆల్ రౌండర్… ప్రతి కాలేజి, యూనివర్సిటీలో ఫిల్మ్ ట్రైనింగ్ ను సిలబస్ లో భాగంగా చేయాలని పిలుపునిస్తారు. ఈ విషయాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లోనూ చూపిస్తూ… ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీతో ఈమేరకు అవగాహన ఒప్పందం చేసుకుని ఉండడం దీపక్ బలదేవ్ దార్శనికతకు అద్దం పడుతుంది.

యువతీ యువకుల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీయడంతోపాటు… వారిలో ఉండే అనవసర భయాలు పోగొట్టి, ఆత్మ విశ్వాసం పాదుకొల్పేందుకు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ట్రైనింగ్ ఎంతగానో ఉపకరించడం తాను ప్రాక్టికల్ గా చూశానని దీపక్ చెబుతారు. ఫిల్మ్ అకాడమి ఫౌండర్ కమ్ ట్రైనర్ గానే మాత్రమే కాకుండా క్యాస్టింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించే దీపక్.. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా కావడం గమనార్హం. తెలుగు – హిందీ భాషల్లో “ఖ్వాబ్ సారే ఝూటే, తు బేఖబర్” చిత్రాలు తెరకెక్కించిన బలదేవ్… త్వరలో మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తున్న “గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి”ని మరింత విస్తృత పరచాలన్న వజ్ర సంకల్పంతో ముందుకు సాగుతున్న “దీపక్ బలదేవ్ ఠాకూర్”ను దిగువ నంబర్ లో 9182084166

Latest News

ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు “తల్లి మనసు”

ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్యేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో "తల్లి మనసు" చిత్రాన్ని మలిచారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు,...

More News