ఛారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే విషయాలపై స్పందించి సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఓ మహిళ సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది.
ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్ కేఎన్ దృష్టికి వచ్చాయి. ఆయన స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పిఠాపురం వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. మరియమ్మకు ఎస్కేఎన్ ఆటో కొనివ్వడం, ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ఎస్ కేఎన్ సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…