టాలీవుడ్

“ఫ్యామిలీ స్టార్” సినిమా చూస్తూ సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు – నిర్మాత దిల్ రాజు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు. దర్శకుడు పరశురామ్ పెట్ల పాల్గొన్నారు. ప్రేక్షకుల సందడి మధ్య “ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ – “ఫ్యామిలీ స్టార్” సినిమా గురించి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ఈ సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్ లో హాయిగా చూడండి. ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. విజయ్, మృణాల్ క్యారెక్టర్స్, విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ..వంటి అన్ని అంశాలు మీకు నచ్చేలా ఉంటాయి. థియేటర్ లో మిమ్మల్ని కలుస్తాను. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఈ మధ్య చిన్న హింట్ ఇచ్చాను. తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్ అవ్వాలని కోరుకుంటారు. ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి సినిమా రిలీజ్ కు మేము ఇదే శ్రీరాములు థియేటర్ లో మార్నింగ్ షో చూసేందుకు ఏప్రిల్ 5న వస్తాం. ఆ రోజు థియేటర్ లో మీ అందరూ నవ్వుతూ సినిమా చూస్తుంటారు. గీత గోవిందం తర్వాత పరశురామ్, విజయ్ కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ ను క్లాస్, మాస్, యూత్ ఫుల్, ఎంటర్ టైనింగ్, ఎమోషన్ తో పరశురామ్ డిజైన్ చేశాడు. విజయ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. పరశురామ్ సినిమాల్లో లైటర్ వేన్ కామెడీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే తరహాలో నవ్విస్తాడు. సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 5న దిల్ సినిమాతో నేను నిర్మాతగా దిల్ రాజుగా మారాను. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే రోజున ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతోంది. మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుందీ సినిమా. మాస్, క్లాస్, యూత్ అ, ఫ్యామిలీ అనే తేడాలు లేకుండా యూనివర్సల్ గా అందరికీ నచ్చే కథ ఫ్యామిలీ స్టార్ లో ఉంది. ఒక సూపర్ హిట్ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాం. అన్నారు.

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూస్తే – ట్రైలర్ కూల్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ గా ఉండి ఆకట్టుకుంటోంది. హీరోయిజం, ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్, హ్యూమర్, యాక్షన్ ..అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా “ఫ్యామిలీ స్టార్” సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సివిల్ ఇంజినీర్ గోవర్థన్ క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ, ఇందుగా మృణాల్ ఠాకూర్ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. విజయ్, మృణాల్ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది. డైరెక్టర్ పరశురామ్ పెట్ల హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చూపించారు. “ఫ్యామిలీ స్టార్” ష్యూర్ సమ్మర్ బ్లాక్ బస్టర్ అనే ఇంప్రెషన్ ట్రైలర్ కలిగించింది. “ఫ్యామిలీ స్టార్” సినిమా మీదున్న హైప్ కు తగినట్లు ట్రైలర్ కట్ చేశారు. కథను ఏమాత్రం మిస్ లీడ్ చేయకుండా ట్రైలర్ ఉండటం మరో విశేషం. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటి టెక్నికల్ అంశాల్లో “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ టాప్ క్వాలిటీతో కనిపిస్తోంది.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago