ప్రిన్స్ నరేష్ అగస్త్య పర్ ఫార్మెన్స్ “కలి” మూవీకి హైలైట్ అవుతుంది కె రాఘవేంద్ర రెడ్డి

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి.

  • తెలుగు చిత్ర పరిశ్రమలో పాత్రికేయుడిగా, పీఆర్ఓ గా, మూవీ రైట్స్ కన్సల్టెంట్ గా, రచయితగా పాతికేళ్లుగా జర్నీ చేస్తున్నాను. ఈ క్రమంలో నా మనసుకు నచ్చిన కథల విన్నప్పుడు వాటికి చిత్ర సమర్పకుడిగా పనిచేశాను. గతంలో అలాంటి సిత్రాలు అనే సినిమాకు ప్రెజెంటర్ గా వ్యవహరించాను. “కలి” సినిమా కథ విన్నప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీకి కూడా వర్క్ చేయడం జరిగింది.
  • కరోనా పాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగింది. మన దేశంలో కూడా ఇది ఎక్కువగానే ఉంది. ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా అడ్డుకుని, వారికి ఆ ఆలోచనను దూరం చేస్తే బాగుంటుంది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి మరోసారి అలాంటి ఆలోచనలు రావు. దర్శకుడు శివ శేషు ఈ పాయింట్ తో “కలి” సినిమా కథ రాసుకున్నాడు. కథ విన్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఇలాంటి నేపథ్యంతో సినిమా ఎవరూ చేయలేదనిపించింది. నేపథ్యం కొత్తగా ఉంది. “కలి” లాంటి సినిమా చేస్తే మనకూ పేరొస్తుందని అనిపించింది ఈ సినిమాకు ప్రెజెంటర్ గా వ్యవహరించాను. థియేటర్స్, మల్టీప్లెక్స్ లతో పాటు ఓటీటీలోనూ ఆదరణ పొందేలా మా సినిమా ఉంటుంది.
  • “కలి” సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది దగ్గర నుంచి ప్రశంసలు వచ్చాయి. “కలి” సినిమా టీజర్ ను కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా మా సినిమా అందరికీ రీచ్ అయ్యింది. ట్రైలర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓటీటీ సహా బిజినెస్ ఎంక్వయిరీస్ జరిగాయి. ఆ వివరాలు మూవీ రిలీజ్ తర్వాత చెబుతాం. ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రతిభ గల నటులు. ఇప్పటికే పలు చిత్రాలతో వారు ప్రూవ్ చేసుకున్నారు. “కలి” సినిమాలో వారి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. నువ్వా నేనా అన్నట్లు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించారు.
  • శివరామ్ అనే గుడ్ పర్సన్ తన జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైమ్ లో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అతని ఇంటి తలుపు తడతాడు. ఆ అపరిచిత వ్యక్తి ఇంట్లోకి వచ్చాక శివరామ్ జీవితం ఎలా మారింది అనేది “కలి” సినిమా కథ. ఈ పాయింట్ ను ఎలాంటి సందేశాలు, ఉపోద్ఘాతాలు లేకుండా క్రిస్ప్ గా తెరకెక్కించాం. మా మూవీలో వీఎఫ్ఎక్స్ మంచి క్వాలిటీతో ఉంటాయి. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీపడకుండా చేశాం. అలాగే సినిమా కోసం ఒక సెట్ వేసి అక్కడ షూటింగ్ చేశాం. సినిమాకు అవసరం మేరకు ఖర్చు చేశాం. ఎక్కడా వృథా చేయలేదు. బల్లి పాత్రకు ప్రియదర్శి, గోడ గడియారంకు అయ్యప్ప పి శర్మ డబ్బింగ్ చెప్పారు. మీరు సినిమా చూస్తున్నప్పుడు వాళ్లు నటించిన ఫీల్ కలుగుతుంది.
  • చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా బిజినెస్ వర్కవుట్ అయ్యే జానర్స్ చేయడం మంచిది. థియేటర్ తో పాటు ఓటీటీకి నప్పేలా మూవీ సెలెక్ట్ చేసుకోవాలి. 10 నుంచి 15 శాతం అటు ఇటూగా ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువైతే ఫర్లేదు. కానీ ఓ రెండు కోట్లు ఎక్కువగా పెడితే ఆ డబ్బు వృథా చేసినట్లే. ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ మూవీ చేస్తే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు. “కలి” సినిమా ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ సినిమా మేకింగ్ మీద ప్యాషన్ ఉన్న యువకుడు. పాతికేళ్లు ఉంటాయి. అలాంటి ఏజ్ లో ఉన్న వాళ్లు ప్రేమకథలతో సినిమా నిర్మిస్తారు. కానీ లీలా గౌతమ్ “కలి” వంటి మెచ్యూర్డ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అతనికి ప్రొడ్యూసర్ గా మంచి ఫ్యూచర్ ఉంది. భవిష్యత్ లో లీలా గౌతమ్ వర్మ మరిన్ని మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తాడు.
  • దర్శకుడు శివ శేషు ప్రతిభావంతుడు. అతనికి పురాణాల మీద పట్టు ఉంది. ఈ మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు శివ శేషులో మంచి టాలెంట్ ఉంది అనిపించింది. అతనికి దర్శకుడిగా “కలి” సినిమా పేరు తెస్తుంది.
  • కథా రచయితగా నా ప్రయాణం కొనసాగుతోంది. ప్రస్తుతం నేను స్టోరీ ఇచ్చిన సినిమా ఒకటి అమెరికాలో షూటింగ్ జరుగుతోంది. అలాగే డివోషనల్ స్టోరీతో ఓ మూవీ స్క్రిప్ట్ చేశాను. ఆ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దర్శకత్వం వహించాలనే ఆలోచన లేదు. వృత్తిపరంగా ఎన్నో సినిమాలు నాకు సంతృప్తిని ఇచ్చాయి.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 day ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago