చార్మింగ్ స్టార్ శర్వా వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Sharwa38 కోసం మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నందితో చేతులు కలిపారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇది1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా.
#Sharwa38 గ్రిప్పింగ్ యాక్షన్, ఎమోషనల్ చార్జ్డ్ సీక్వెన్స్‌లతో ఇంటెన్స్ నెరేటివ్ గా వుంటుంది. ఇంతకు ముందెన్నడూ చూడని ఎలిమెంట్స్ తో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ మూవీగా వుండబోతోంది.
సబ్జెక్ట్ యూనివర్సల్ అప్పీల్ వుండటంతో మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.శర్వా, సంపత్ నంది ఇద్దరికీ ఇది మెడిన్ పాన్ ఇండియా మూవీ.
సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసిన దర్శకుడు, శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు, 60ల నాటి క్యారెక్టర్ ని పోషించేందుకు శర్వా కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది.
#Sharwa38 కి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామ్యాన్ గా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు. #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
డీవోపీ: సౌందర్ రాజన్ S
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
PRO: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…