ఘనంగా “చకోర – Lunar Love Bird” సినిమా స్పెషల్ ప్రివ్యూ, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Must Read

ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న “చకోర – Lunar Love Bird” మూవీ

High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ “చకోర – Lunar Love Bird”. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం హైదరాబాద్ లో ఈ సినిమా మీడియా ప్రివ్యూతో పాటు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ – నా సినిమాకు మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను మా మూవీ ప్రమోషన్ కోసం ఏ స్టార్స్ బైట్స్ తీసుకోలేదు. నా వరకు నేను మీడియానే నాకు స్టార్స్ గా భావిస్తా. నా ఆలోచనల్నీ ఈ మాస్ పొయెట్రీ సినిమాగా రూపొందించాను. మీరు మా మూవీకి ఇచ్చే స్పందన కోసం వేచి చూస్తున్నా. ఈ సినిమా బాగుంది అంటే ఆ క్రెడిట్ మా టీమ్ కు ఇస్తాను. బాగా లేదంటే ఆ తప్పు నాదిగా భావిస్తా. మా ప్రొడ్యూసర్స్ ఏపీలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు గారు ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకుంటున్నారు. మా చిత్రానికి మీరంతా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – ఈ సినిమా చూస్తున్నంత సేపు కొత్త హీరో హీరోయిన్ చేసినట్లు ఎక్కడా అనిపించలేదు. అప్పట్లో దేవదాస్ సినిమాతో రామ్ అరంగేట్రం చేసినట్లు ఈ సినిమాతో మా శ్రవణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్, రవితేజ ఎంత కష్టపడి ఎదిగారో అలా మా హీరో కూడా కష్టపడతాడు. హీరోగా మంచి పొజిషన్ కు వెళ్తాడని నమ్ముతున్నాం. ఈ సినిమా చూశాక ఆ రాత్రి నిద్రపట్టలేదు. తెల్లవారి వెళ్లి ఈ సినిమా తీసుకుంటున్నాం అని చెప్పాం. అంత బాగా నచ్చింది. ఈ ఏడాది టాలీవుడ్ కు చాలా బాగుంది. చిన్నా పెద్దా సినిమాలు బాగా ఆడుతున్నాయి. అలాగే మా “చకోర – Lunar Love Bird” సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.

హీరో శ్రవణ్ మాట్లాడుతూ – మా “చకోర – Lunar Love Bird” సినిమాకు మీరు అందిస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు ముందు మా డైరెక్టర్ గారికి ఒక పెద్ద బ్యానర్ నుంచి ఒక పేరున్న హీరో నుంచి ఆఫర్ ఉంది. అయితే మాకు ఇచ్చిన మాట కోసం నన్ను హీరోగా తీసుకుని ఈ మూవీ చేశారు. ఈ సినిమా మిమ్మల్ని ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటుంది. ఇందులోని ప్రతి ట్విస్ట్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.

నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు

టెక్నీషియన్స్

లొకేషన్స్ & ప్రమోషనల్ ఆఫీసర్ : సనపల చిన్నబాబు
క్యాషియర్ : హరీష్
లైన్ ప్రొడ్యూసర్: కపర్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : లాలం కన్నాజీ
ఎస్ఎఫ్ఎక్స్ : రఘునాధ్ కేమిశెట్టి
వీఎఫ్ఎక్స్ : చందు ఆది
డీటీఎస్ సౌండ్ ఇంజనీర్ : రాధాకృష్ణ
పాటలు : రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
యాక్షన్ కొరియోగ్రఫీ – రామ్ కిషన్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని
డీవోపీ – రుప్ప గోపీకృష్ణ
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ
నిర్మాత – డా. చింతాడ హేమారావు
రచన, దర్శకత్వం – మంగా శ్రీనివాస్

Latest News

డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా దేవి పిటిషన్▪️ ఎన్నికల తర్వాత...

More News