ఫిబ్రవరి 11న మెగాస్టార్ “గ్యాంగ్ లీడర్” రీ రిలీజ్ కు సన్నాహాలు

Must Read

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ “గ్యాంగ్ లీడర్” సినిమాను ఫిబ్రవరి 11న రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..వేగా ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. సంక్రాంతి సినిమాల తర్వాత మంచి డేట్ చూసుకుని ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు,లోగడ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

చాలా ఏళ్ల క్రితం వచ్చిన “గ్యాంగ్ లీడర్” సినిమా అప్పట్లో అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని, అందులో చిరంజీవి, విజయశాంతి నటనతో పాటు చక్కటి కథ, కథనాలు, కామెడీ, యాక్షన్ వంటి అన్ని అంశాలు ఆద్యంతం అలరింపజేశాయన్న విషయం తెలిసిందే.. ఇక పాటల సంగతికి వస్తే “పాప రీటా….”,, “పాలబుగ్గ…”, “భద్రాచలం కొండ… “, “వానా.. వానా…”, “వయసు వయసు…”, “పనిసా ససా…” వంటి పాటలు, వాటికి చిరంజీవి చేసిన డాన్స్ నేటికీ వీనులవిందు చేస్తున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు.

Latest News

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో యాక్షన్...

More News