వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ప్రేమించానే పిల్లా సాంగ్ ని రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ ఈ సాంగ్ క్యాచి బీట్స్ తో లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత ఎట్రాక్షన్ ని తీసుకొచ్చాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మల్లికార్జున్ ఎన్ డీవోపీ గా, అవినాష్ గుర్లింక ఎడిటర్ గా పని చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. రాజేష్ రామ్ బాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల , సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహాద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయ్, ఐడ్రీం నాగరాజు, ఎంవీఎన్ కశ్యప్..
టెక్నికల్ టీం :
రచన, దర్శకత్వం: రైటర్ మోహన్
బ్యానర్: శ్రీ గణపతి సినిమాస్
నిర్మాత: వెన్నపూస రమణ రెడ్డి
సమర్పణ: లాస్య రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజేష్ రామ్ బాల
సంగీతం: సునీల్ కశ్యప్
డీవోపీ: మల్లికార్జున్ ఎన్
ఎడిటర్ : అవినాష్ గుర్లింక
ఆర్ట్ డైరెక్టర్ : బేబీ సురేష్
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
పీఆర్వో: వంశీ శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…