నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో మూవీ ‘ప్రేమంటే’ గ్రాండ్‌గా లాంచ్

ఎక్సయిటింగ్ లైనప్ తో అలరించబోతున్న ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో సినిమా చేస్తున్నారు. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్ల పై నిర్మిస్తున్నారు, స్పిరిట్ మీడియా దీనిని సమర్పిస్తోంది. ఈరోజు, మేకర్స్ ‘ప్రేమంటే’ అనే టైటిల్‌ను విడుదల చేశారు, రెండు టీ కప్పులు టెర్రస్‌పై వుంచి, ప్రశాంతమైన నగర రాత్రి వాతావరణాన్ని కలిగి ఉన్న ఎట్రాక్టివ్ పోస్టర్‌ను విడుదల చేశారు, “థ్రిల్-యూ ప్రాప్తిరస్తు” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌  ఎక్సయిటింగ్ సినిమా ఎక్స్ పీరియన్స్ చూస్తోంది.

ఈరోజు, మూవీ టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైయింది. రానా క్లాప్‌ ఇవ్వగా, సందీప్ రెడ్డి వంగా ముహూర్తపు షాట్ కోసం కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్ రెడ్డి, రామ్ మోహన్ రావు, జనార్దన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ మూవీ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

సునీల్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో జాన్వి నారంగ్ కంటెంట్-బేస్డ్  సినిమా ప్రపంచంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆమె మొదటి ప్రాజెక్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక ఉత్తేజకరమైన ఎంటర్‌టైనర్. ఇండస్ట్రీ పవర్‌హౌస్ రానా దగ్గుబాటి సపోర్ట్ పొందడం ఆమెకు లక్, అతని నిర్మాణ అనుభవం, అసాధారణమైన స్క్రిప్ట్ చాయిస్ ఈ చిత్రానికి గొప్ప వాల్యూని జోడిస్తున్నాయి.

ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు, అన్వర్ అలీ ఎడిటర్.

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత : ఆదిత్య మెరుగు
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago