ప్రముఖ హీరోయిన్ లయ చేతుల మీదుగా’ప్రేమబానిస’ పూజా కార్యక్రమం, పోస్టర్ లాంఛ్

హనీ క్రియేషన్స్ సమర్పణలో హీరోలు శ్రీ, రాజువర, హీరోయిన్ శృతి శంకర్, నటులు అప్పారావు, రైజింగ్ రాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమబానిస’. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే -దర్శకత్వం సలీం భాషా. నిర్మాతలు ఎస్. మహబూబ్ భాషా, కె. ప్రభాకర్. ఈ చిత్రానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ లయ చేతుల మీదుగా పూజా కార్యక్రమం, పోస్టర్ లాంఛ్ ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ శివ నిర్వహిస్తుండగా, అశోక్ ఎడిటింగ్ బాధ్యతలను సమకూరుస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు సలీం భాషా మాట్లాడుతూ… హీరోయిన్ లయ చేతుల మీదుగా ‘ప్రేమబానిస’ పోస్టర్ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. మా చిత్ర కార్యక్రమానికి చీప్ గెస్ట్ గా వచ్చిన లయకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రేమబానిస’ అందర్నీ అలరించే కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనన్న నమ్మకం ఉంది. సెప్టెంబర్ నుండి కర్నూల్ లో ఈ చిత్రం శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది అని తెలిపారు.
నిర్మాతలు ఎస్. మహబూబ్ భాషా, కె. ప్రభాకర్ లు మాట్లాడుతూ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తోన్న ప్రేమకథలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించనున్నాం అని తెలిపారు.
హీరోలు శ్రీ, రాజువర మాట్లాడుతూ.. యువతరం మెచ్చే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ.. చక్కటి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన కథానాయిక పాత్రకు పూర్తి న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పీఆర్ ఓ: బాబునాయక్ (సినీలోకం -సినీ సందడి).

TFJA

Recent Posts

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా నటించనున్న కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్.

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…

9 hours ago

‘అ’ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా అందర్ని థ్రిల్ల్‌ చేస్తుంది: హీరో రాహుల్‌ విజయ్‌.

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.…

9 hours ago

ఘనంగా “చకోర – Lunar Love Bird” సినిమా స్పెషల్ ప్రివ్యూ, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy…

1 day ago

డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా…

1 day ago

ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…

3 days ago

సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…

3 days ago